దళిత మంత్రి భట్టి విక్రమార్కపై”కొత్త పలుకు” లో మరోసారి విరుచుకుపడ్డ ఆర్కే!!

Pathi Sreenivas Rao
9 Min Read

ఆంధ్రజ్యోతి గ్రూప్ అధినేత వేమూరి రాధాకృష్ణ తన “కొత్తపలుకు” లో మరోసారి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను టార్గెట్ చేశారు,గతవారం భట్టి విక్రమార్కపై చేసిన ఆరోపణలను కంటిన్యూ చేశారు, భట్టి విక్రమార్క తప్పు చేశాడు,అధికారులను బెదిరించాడు అంటూ తన ఆర్టికల్లో భట్టి విక్రమార్కపై విరుచుకు పడ్డాడు,నిజానికి రాధాకృష్ణ ఆర్టికల్ చూసిన తరువాత కొంచెం అతి ఎక్కువ అయినట్లు అనిపించింది,తనకుతాను ఒక గొప్ప మేధావిగా,తనకంటే ఈ దేశంలో గొప్ప జర్నలిస్టు ఎవరు లేరన్నట్లుగా ఒక పిచ్చి భ్రమలో బ్రతుకుతున్నట్లు అనిపించింది,ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పేముందు భట్టి విక్రమార్క మీడియా సమావేశం పెట్టీ గతవారం రాధాకృష్ణ తనపై లేవనెత్తిన అంశాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో వివరణ ఇచ్చారు,సైట్ విజిట్ నిబంధన పెట్టీ ఆ నిబంధన ఆధారంగా ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి అల్లుడితో పాటు మెగా కృష్ణారెడ్డికి Naini Coal Black కాంట్రాక్టును కట్టబెట్టే ప్రయత్నం భట్టి విక్రమార్క చేసినట్లు గతవారం రాధాకృష్ణ చేసిన ఆరోపణ,కానీ ఆ సైట్ విజిట్ అనే నిబంధన భట్టి విక్రమార్క పెట్టింది కాదు దేశంలో అనేక సంస్థలు అమలు చేస్తున్నదే, రైల్వేస్, హెల్త్, డిఫెన్స్ అనేక రంగాలతో పాటు సింగరేణి కూడా అమలు చేస్తున్న నిబంధనే,టెండర్లు పిలిచే సమయంలో సైట్ విజిట్ నిబంధన ఉందని డాక్యుమెంట్ ఆధారాలతో స్పష్టం చేశారు,ఆ డాక్యుమెంట్ ఆదారాలు చూసిన తరువాత భట్టి విక్రమార్క ఈ నిబంధన పెట్టాడు అని వ్రాసిన రాధాకృష్ణ చేసిన ఆరోపణ అబద్ధం తేలిపోయింది,అందుకే ఈ రోజు తన కొత్త పలుకులో రాధాకృష్ణ ఎక్కడా కూడా ఈ ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం,గతంలో జరిగిన టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి బంధువులకు,BRS పార్టీ నేతల బంధువుల కొన్ని టెండర్లు దక్కాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ టెండర్లలోని అంశాల జోలికి ఆయన పోకపోవడంపై కూడా పలు అనుమానాలకు తావిస్తోంది…

మరి గతంలో టెండర్లలో కూడా సైట్ విజిట్ నిబంధన ఉంది కదా వాళ్లెవరికి లేని అభ్యంతరం వీళ్ళకు మాత్రమే ఎందుకు ఉంది,టెండర్లు నిర్వహించడానికి ముందు సమావేశం జరుగుతుంది,ఆ తరువాత టెండర్లకు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది,అసలు ఆ సమావేశమే జరగనప్పుడు సైట్ విజిట్ సర్టిఫికెట్ రాలేదని ఎలా చెబుతారంటూ భట్టి విక్రమార్క వేస్తున్న ప్రశ్న,ఆ ప్రశ్నకు కూడా రాధాకృష్ణ దగ్గర సమాధానం లేదు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరునికి సంబందించిన కంపెనీ తనకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వలేదని బయటకొచ్చి చెప్పిందా ? దీనికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుని కంపెనీ కాకుండా ఆ టెండర్లలో వేరే కంపెనీ వారెవరైనా పాల్గొన్నారా ? వారికి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చారా ? ఇచ్చి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా ? అసలు Naini Coal Black టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయిందా ? అంటే రాధాకృష్ణ దగ్గర సమాధానం లేదు, ఏటువంటి ఆధారాలు లేకుండా సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా సింగరేణి టెండర్లు కొట్టేయడానికి ప్రయత్నాలు చేశారని ఎలా వ్రాస్తారు?

నేను బురద చుల్లుతా మీరు కడుక్కోండి అంటున్నారు తప్ప అసలు భట్టి విక్రమార్క సైట్ విజిట్ సర్టిఫికెట్ అంశంపై స్పష్టంగా ఆదారాలతో ఇచ్చిన వివరణపై ఆయన స్పందన ఏమిటో తెలియజేయలేదు,ఈ వ్యవహారంలో
భట్టి విక్రమార్క మాత్రమే ఎందుకు మీకు టార్గెట్ అవుతున్నాడు ? భట్టి విక్రమార్క మెగా కృష్ణారెడ్డికి కూడా బొగ్గు కాంట్రాక్టు ఇప్పించే ప్రయత్నం చేశాడనీ వ్రాశారు కదా మరి ఆయనెందుకు మీకు టార్గెట్ అవడం లేదు ?
మెగా కృష్ణారెడ్డి జోలికి వెళితే ఏమి జరుగుతుందో రాధాకృష్ణకు తెలుసు కాబట్టి దళిత మంత్రి భట్టి విక్రమార్క వెనుక అండదండలు ఏమి లేవు కాబట్టి,భట్టి విక్రమార్క మీద బురద చల్లుతాం,వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాం అనే రీతిలో వ్యవహరించడం ఎంత వరకు సబబు,వాస్తవానికి భట్టి విక్రమార్క కొట్లాడి మెగా కృష్ణారెడ్డికి పదిహేను వందల కోట్ల కాంట్రాక్టు ఇప్పించే పరిస్థితి ఉంటుందా ? మెగా కృష్ణారెడ్డి కోసం నిబంధనలు మార్చే అవకాశం ఉంటుందా ? ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి,మెగా కృష్ణారెడ్డి,భట్టి విక్రమార్క కలిసి కుట్ర చేస్తున్నారని మీరు వ్రాసే క్రమంలో ఒక్క భట్టి విక్రమార్క మాత్రమే ఎందుకు మీకు టార్గెట్ అవుతున్నారు?
మెగా కృష్ణారెడ్డి గురించి ఒక్క మాట కూడా నెగిటివ్ గా ఎందుకు వ్రాయడం లేదు,కాస్త కామన్ సెన్స్ తో ఆలోచించించే వాళ్ళకు అర్థమవదా ? మీ రాతల వెనుక పరమార్థం ఏమిటనే విషయం…..

Naini Coal Black టెండర్ల అంశాలకు సంబంధించి ఒక రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రినీ బెదిరించే ప్రయత్నమో లేక ఆయనపై తప్పుడు ప్రచారం చేసి వ్యతిత్వ హననం చేయడమో మీరు కావాలని చేస్తున్నట్లు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది,ఈ రాష్ట్రంలో మేము చెప్పిందే నడవాలి,మేము చెప్పిన వ్యక్తులే పరిపాలించాలనే తరహాలో ప్రవర్తిస్తున్నారు,కానీ ఇది సరైన విధానం కాదు,గతంలో సింగరేణి వ్యవహారాలన్నీ ముఖ్యమంత్రులే చూసారనీ గత ఆర్టికలో మీరు అవేదన వ్యక్తం చేశారు,కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చూసే అవకాశం లేకుండా పోయిందనే బాధ మీలో కనిపిస్తుంది,ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతిలో ఆ శాఖ ఉండడం,భట్టి విక్రమార్క వెన్నుముక ఉన్న మంత్రి,ఆయన శాఖలో వేరెవరిని వ్రేలు పెట్టనివ్వకుండా ఏమున్నా ఆయనే చూసుకుంటున్నాడు,బహుశా ఆది మీకు బాధగా అనిపిస్తూ ఉండవచ్చు అందుకే మీ ప్రస్తేషన్ అంతా మీ అక్షరాల్లో కనిపిస్తుంది,మీ అవేదన వెనుక మీ బాధ ఏమిటో కూడా రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతుంది,ఏ పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడడం కోసం ఇలాంటి వార్తలు వ్రాస్తున్నారంటూ భట్టి విక్రమార్క ప్రశ్నిస్తే మీరు సమాధానం దాటవేస్తూ కోమటిరెడ్డి ప్రయోజనాల కోసమో, రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసమో వ్రాసే వాడిని కాదు అని చెప్పారు, వాస్తవానికి భట్టి విక్రమార్క ఎవరి పేరు ప్రస్తావించలేదు అయినా మీరే కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లు
ప్రస్తావిస్తే దాన్ని కూడా అర్ధం చేసుకోలేనంత అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు,చివరిగా పవన్ కళ్యాణ్ ను కొనేందుకు తెలంగాణలో ఒక పార్టీ ప్రయత్నించిందని,వెయ్యి కోట్లు ఇచ్చేందుకు రెడీ అయింది,వెయ్యి కోట్లరూపాయలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో కలవకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్నారని ఒక నిరాధార వార్తా కథనం వ్రాశారు,ఈ వార్తను పవన్ కల్యాణ్,నాగబాబు ఖండించారు,చెప్పు తీసుకుని కొడతా ఇటువంటి వార్తలు వ్రాస్తే అని పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు,దాని మీద రాధాకృష్ణ ఎందుకు రియాక్ట్ అవలేదు,మీ రాతలు,మీరు చేసే వికృత చేష్టలు అన్ని ప్రజా బహుళ్యంలో ఉన్నాయి,మీకు ప్రశాంత్ కిషోర్ బాగా దగ్గర వాడు కాబట్టి అతనితో ఒకసారి సర్వే చేయించుకుంటే తెలుస్తుంది ప్రజల్లో మీ గురించి,మీ అసంబద్ధ రాతల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో…

అలాగే బొగ్గు గనుల టెండర్ల విషయం మీద ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేశాను అంటూ వ్రాసుకున్నారు,అసలు ఆంధ్రజ్యోతి దిన పత్రిక మీ చేతిలోకి వచ్చిన తరువాత తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఒక సామాజిక అంశం మీద పోరాడిందా ? వ్యక్తుల టార్గెట్ గా వ్యక్తిత్వ హా చేయడం తప్ప మీరు చేసిందేమిటి? తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో కేసులు విచారణ చేయడంలో తాత్సారం జరుగుతుంది,వాటిని త్వరితగతిన
పూర్తి చేయాలి అని చెప్పుకొచ్చాడు,ఈ మాటల వెనుక ఆయన బాధంతా ఏమిటంటే కేసీఆర్, కేటీఆర్ ను వెంటనే లోపల వేయాలి,ఆది ఆయన అత్యవసరమైన కోరిక కూడా,ఇంకో విషయం ఏమిటంటే పోన్ ట్యాపింగ్ జరిగీతే కూడా వాళ్లను లోపల వేయకుండా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తుందని చెబుతున్నారు,ఈ విషయం మీకు ఎలా తెలిసింది ? మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏమిటి? నిన్నటికి నిన్న మంత్రి జూపెల్లి కృష్ణారావు మీడియా సమావేశంలో BRS నాయకులను ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులగానే విచారణకు పిలిచారు నిందితులుగా కాదని స్పష్టం చేశారు, విచారణ జరుగుతున్న సమయంలో మీకు ఏమి తెలుసని తప్పుడు ప్రచారాలు చేసి దానిపై చర్యలు తీసుకోవాలని ఏ ఆధారాలతో చెబుతారు,ఈ మొత్తం వ్యవహారంలో టెక్నికల్ ఇష్యూస్ జోలికి పోకుండా నా ఇష్టం వచ్చినట్లు వార్తలు వ్రాస్తాను మీరు సమాధానం చెప్పుకోండి అనే తరహాలో ప్రవర్తిస్తే జనాల మధ్య పలుచన అవుతున్నారనే విషయం గ్రహించకపోతే ఎలా ?….

అదే విధంగా బొగ్గు గనుల కాంట్రాక్టు వ్యవహారాలను నేనే బయట పెట్టానని చెబుతున్నారు,నిజంగా మీరు చెప్పిన ఆ మాటకు మీ మీద జాలి పడాలో జర్నలిజం సచ్చిపోయిందని బాధ పడాలో అర్థం కాలేదు, నిజానికి ఈ నెల పద్నాలుగో తారీకునాడే బొగ్గు గనుల విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య జరుగుతున్న వివాదం గురించి ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులు జరిగాయని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దీనికి సంబంధించి పదిహేనో తారీకు BRS పార్టీ మీడియా సమావేశం పెట్టీ బొగ్గు గనుల కాంట్రాక్టు విషయంలో స్కాం జరుగుతుందని చెప్పారు,మీరు పదిహేడవ తారీకు రోజు వార్త వ్రాసి ఆ అంశాన్ని BRS పార్టీ వాడుకుంటుందని ఎలా వ్రాసారు, ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డను ఎలా చెప్పుకుంటారు,ఎవరో వ్రాసిన వార్తను మీరు వ్రాసినట్లు ఎలా చెప్పుకుంటారు….

ఈ అంశంతో పాటు తన కొత్త పలుకులో వైయస్ రాజశేఖరరెడ్డి ప్రస్తావన కూడా తన కొత్త పలుకులో తెచ్చారు భట్టి విక్రమార్క నేను వైయస్ శిష్యుణ్ణి కాబట్టే నన్ను టార్గెట్ చేసారేమో అని మాట్లాడితే వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు తీసుకునే సంస్కృతి మొదలైందని,కమీషన్లు తీసుకోవడానికి దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులకు ఆయనే ఆదర్శం అంటూ వ్రాస్తూ ఉంటే మీకు రాజశేఖర్ రెడ్డి మీద,కొంతమంది వ్యక్తుల పట్ల నువ్వు కక్కే విషం ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ మీ అంతటికి మీరే మీ రాతల ద్వారా తెలియజేశారూ,రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే 2004 లో తెహల్కా డాట్ కామ్ చంద్రబాబు అవినీతి మీద ఒక సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది,ఈ దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే,ఆయన ఆస్తుల విలువ పదివేల కోట్లంటూ సంచలన కథనం వెలువరించింది,2004 లో పదివేల కోట్లు అంటే ప్రస్తుత విలువ లక్షల కోట్లలో ఉంటుంది,ఆ తర్వాత ఆ కథనాన్ని తారుమారు చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ విధితమే,తెహల్కా వ్రాసింది అంటే కట్టుకథ అనుకున్నా స్వయంగా చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు “ఒక చరిత్ర కొన్ని నిజాలు” అనే పుస్తకంలో చంద్రబాబును ఉద్దేశించి మూడు,నాలుగు అంశాలను ప్రస్తావించారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు సంబందించిన విష్ణుప్రియ హోటల్ నష్టాల్లో ఉంటే కడప జిల్లాకు చెందిన బలరాం రెడ్డి అనే వ్యక్తికి ఎక్కువ డబ్బులకు అంటగట్టి ఆ ఒప్పందంలో భాగంగానే జెడ్పీ చైర్మన్ పదవినీ ఇచ్చాడని స్వయంగా దగ్గుబాటి వెంకటేశ్వర రావు వ్రాసారు,ఇది కమీషన్లు, ముడుపుల వ్యవహారం కదా,వీటన్నింటికి మించి చంద్రబాబును చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు,నాయకులంతా టార్చ్ లైట్ మంత్రి అనేవాళ్ళని దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు చిన్న నీటిపారుదల శాఖా మంత్రిగా ఉన్నపుడు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేసేవారు,ఏ కాంట్రాక్టరైనా రాత్రి వేళల్లో టార్చ్ లైట్ తీసుకుని ప్రాజెక్టు పరిశీలనకు వస్తున్నాను,పనుల నాణ్యతను పరిశీలిస్తున్నానంటూ వెళ్లేవాడు దీంతో కాంట్రాక్టులు బెంబేలెత్తిపోయి ముడుపులు ఇచ్చుకునే వాళ్లని దగ్గుబాటి వ్రాసారు, రాధాకృష్ణ వ్రాసినట్లు రాజశేఖర్ రెడ్డి అప్పటికి మంత్రి కూడా కాలేదు,మరి ఈ కమీషన్ల సాంప్రదాయం ఎపుడు మొదలైంది,ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో డబ్బులు పంచిపెట్టడం మొదలు పెట్టిందెవరో ప్రతి ఒక్కరికి తెలుసునని దగ్గుబాటి పలు వేదికల మీద అన్నది నిజం, అయినప్పటికీ రాధాకృష్ణ పదహారేళ్ల క్రితం చనిపోయిన రాజశేఖర్ రెడ్డినీ టార్గెట్ గా చేసుకుని ఆయనే ఈ రాష్ట్రంలో కమిషన్ల విధానం తెచ్చారంటూ ఎందుకు బురద చల్లుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆయన కుటుంబాన్ని డ్యామేజ్ చేయొచ్చు,అవినీతి మచ్చ అంటించవచ్చు,చంద్రబాబు మీద ఉన్న ఎలిగేషన్స్ అన్ని పక్కదారి పట్టించవచ్చు అనే తాపత్రయంలో చంద్రబాబు
బండారాన్ని తనంతటికి తానే బయట పెట్టడం విశేషం….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment