పాలేరు సమగ్ర అభివృద్ధి బాధ్యత పొంగులేటిది: తుంబూరు దయాకర్ రెడ్డి!

Pathi Sreenivas Rao
1 Min Read
Highlights
  • ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్దే లక్ష్యంగా మంత్రి పొంగులేటి ‘నంబర్ వన్’ సంకల్పం...
  • మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించండి.. ఏదులాపురం ప్రగతికి మంత్రి పొంగులేటి గ్యారెంటీ...
  • అభివృద్ధిలో ‘పాలేరు’ రాష్ట్రానికే దిక్సూచి కావాలి....
  • నారీ శక్తికి నీరాజనం.. ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళలకే అగ్రతాంబూలం.....
  • లబ్ధిదారులకు రూ:62.77 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో తుంబూరు దయాకర్ రెడ్డి....

పాలేరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగులు వేస్తున్నారని, రాబోయే రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ‘నంబర్ వన్’ గా తీర్చిదిద్దేందుకు మంత్రి పొంగులేటి కృషి చేస్తున్నారని ఆయన క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు,గురువారం ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 73 మంది,ఖమ్మం రూరల్ మండలంలో 105 మంది లబ్ధిదారులకు రూ: 62.77 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశార,ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏదులాపురం మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తే,ఈ ప్రాంతాన్ని రాష్ట్రం యావత్తు గర్వించేలా అభివృద్ధి చేసే బాధ్యతను మంత్రి పొంగులేటి స్వయంగా తీసుకుంటారని భరోసా ఇచ్చారు…..

అదే విధంగా మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిర్వచనం చెబుతోందని దయాకర్ రెడ్డి అన్నారు,మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆగకుండా, ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతలను సైతం మహిళలకే అప్పగించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు,మహిళలను కేవలం ఓటర్లుగానే కాకుండా, మహిళలను పాలకులుగా చేయాలన్న సంకల్పంతోనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో చైర్మన్ సీట్లలో మెజారిటీ స్థానాలను వారికే రిజర్వ్ చేసినట్లు గుర్తుచేశారు,ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని ఆయన పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment