ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్

Pathi Sreenivas Rao
3 Min Read
KTR and Harish Rao C a review of the Municipal elections with BRS party leaders from the undivided district.....
Highlights
  • హైదరాబాదులో పార్టీ జిల్లాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో సమావేశమైన కేటీఆర్ ...
  • రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మంలోని పట్టణల ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్పడం ఖాయం ....
  • ఉమ్మడి జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్న చేసింది శూన్యం ....
  • రెండు సంవత్సరాలుగా పట్టణాలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది ?
  • రెండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా పట్టణాలకు ఇవ్వని ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీనే.....
  • రెండు సంవత్సరాల్లో పట్టణాలకు ఇచ్చిన నిధులు… చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్.....

ఈరోజు ఖమ్మం ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణులతో కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లాలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించాలి అని కేటీఆర్ స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరయ్యారు,రానున్న పురపాలక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని, రెండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఏ పట్టణానికి చెల్లించని ఏకైక ప్రభుత్వంగా చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిపోతుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో పట్టణాల్లో పరిపాలన పూర్తిగా పడకేసిందని… పారిశుధ్యం నుంచి మొదలుకొని ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి శిలాఫలకాలు వేయడం తప్పించి… ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఒకటి లేదన్నారు….

ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న…చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం అన్నారు. తమ మంత్రి పదవులను కేవలం తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ ప్రజలను పట్టణాలను గాలికి వదిలేసారని కేటీఆర్ ఆరోపించారు. 10 సంవత్సరాలు పాటు ఖమ్మం జిల్లాలోని ప్రతి పట్టణం అద్భుతంగా అభివృద్ధి చెందిందని, రెండు సంవత్సరాలలో ఒకటి అరా తప్పించి ఎక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పట్టణాలలో చేపట్టలేదని కేటీఆర్ అన్నారు. ముగ్గురు మంత్రులు ఆయా పట్టణాల్లో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముగ్గురు మంత్రుల వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా పట్టణ ఎన్నికల్లో ప్రజల్లోకి పోవాలని సూచించారు….

ముగ్గురు మంత్రులు గత ప్రభుత్వం ప్రారంభించిన అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు, రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, మోడల్ మార్కెట్ల వంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి నిధులు ఆపివేయడంతో అన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతూ… మరోవైపు పట్టణాలను పడుకోబెట్టి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందన్నారు,ఈ రెండు సంవత్సరాల్లో జిల్లాలోని పట్టణాలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను,ఇచ్చిన నిధులను వివరించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాలు చేశారు….

జిల్లాలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను తట్టుకొని మంచి ఫలితాలు సాధించామని… ఇదే స్పూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు,జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నేతలు హాజరైన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత హరీష్ రావు కూడా పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. సమిష్టిగా కృషి చేసి ఎన్నికల్లో మంచి విజయం నమోదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో పాల్గొన్న నేతలు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను వివరించి… ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత, బీఆర్ఎస్ కి అనుకూల వాతావరణం ఉన్నదని తెలిపారు….

ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాలా ఉపేందర్ రెడ్డి,మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు,రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర,మాజీ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు,బానోత్ హరిప్రియ,తాటి వెంకటేశ్వర్లు,మెచ్చ నాగేశ్వరరావు,బానోత్ చంద్రావతి, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు…

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment