బి.ఆర్.యస్ కార్యకర్తల ఇంటి ముందు కాంగ్రెసోల్లు బిచ్చమెత్తుకుంటున్నారు!!

Pathi Sreenivas Rao
1 Min Read
Puvvada Ajay Comments Khammam Congress Party

ఖమ్మం జిల్లా: ది:8:1:2926

ఖమ్మం నగరం, తెలంగాణ భవన్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బి.ఆర్.పార్టీ తరుపున గెలిచిన సర్పంచులకు,ఉప సర్పంచులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో బి.ఆర్.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు,తొలుత పాలేరు నియోజకవర్గం నాయకన్ గూడెం నుండి ఖమ్మం బి.ఆర్.యస్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో కేటీఆర్ కు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు…..

ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఉద్దేశించి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి,రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేక నీచ రాజకీయాలకు పాల్పడుతోంది, సిగ్గూ శరం వదిలేసి బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్ల ముందు బొచ్చ పట్టుకున్న బిచ్చగాళ్ల లా కాంగ్రెసొళ్ళు తిరుగుతున్నారని
ఎద్దేవా చేశారు,ఎవరు ఉన్న ఎవరు పోయినా నిబద్ధత కలిగిన సైనికుల్లాంటి కార్యకర్తలు మా పార్టీలో ఉన్నారు,ఒక్కరు పోతే వందమంది నాయకులను తయారు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు…..

అదే విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎన్ని నిర్భంధాలు, పోలీస్ కేసులు, ఎన్ని ఒత్తిల్లు, ప్రలోబాలు విటన్నిటి ఆదిగమించి మనం 100 పైగా సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు గెలిపించుకున్నాం,నిబద్దత కలిగిన బి.ఆర్.యస్ కార్యకర్తలకు,వారి పోరాట స్ఫూర్తి కీ,
నియోజకవర్గం ఇంచార్జిలు, మాజీ ఎమ్మెల్యే లు, మాజీ ఎంపీ,మండల ప్రెసిడెంట్ లు,పార్టీ కార్యకర్తలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు,కష్ట కాలంలో పార్టీకి అండగా వుండే ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో పార్టీ అండగా ఉంటుందనీ
హామీ ఇచ్చారు…

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment