రేణుక చౌదరి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరా… తన మాటలను వక్రీకరించారని వివరణ…

Pathi Sreenivas Rao
2 Min Read

హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి నిన్న చేసినట్లు భావిస్తున్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై తెలంగాణ పీసీసీ (PCC) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగి, ఆమెకు ఫోన్ చేసి వివరణ కోరారు…రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు బలం పుంజుకుంటున్నాయని, కాంగ్రెస్ నాయకుల మీద బీజేపీ ఫోకస్ చేస్తోందని, కానీ దానికి కౌంటర్‌గా కాంగ్రెస్ నుంచి సరైన యాక్షన్ ప్లాన్ లేదంటూ రేణుక చౌదరి వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది,ఈ వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయని కాంగ్రెస్ అధిష్టానం కొంత సీరియస్ అయినట్లు సమాచారం….

ఈ పరిణామాల నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నేరుగా రేణుక చౌదరికి ఫోన్ చేసి ఆరా తీశారు అయితే, తాను అలాంటి కామెంట్స్ చేయలేదని, తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని రేణుక చౌదరి స్పష్టం చేశారు “బీఆర్ఎస్ బలం పుంజుకుందని కానీ, లేదా కాంగ్రెస్ నాయకుల మీద బీజేపీ ఫోకస్ చేసిందని కానీ తాను ఎలాంటి కామెంట్లు చేయలేదని” ఆమె పీసీసీ చీఫ్‌కు వివరించారు, వాస్తవానికి, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన నేతలే కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, కాంగ్రెస్‌లో చేరేందుకు వారు ప్రయత్నిస్తున్నారని మాత్రమే తాను చెప్పానని ఆమె స్పష్టత ఇచ్చారు…..

మరోవైపు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఒక్కో జిల్లా అధ్యక్షుడితో 10 నుంచి 15 నిమిషాల పాటు విడిగా భేటీ అవుతూ, డీసీసీలకు పూర్తి అధికారాలు ఇచ్చే ప్రక్రియపై ఆమె ప్రధానంగా సమీక్ష చేస్తున్నారు,ఈ సమావేశాల్లో రేణుక చౌదరి వ్యాఖ్యల గురించి ప్రత్యేకంగా చర్చ జరగనప్పటికీ, రేణుక చౌదరి ఇచ్చిన వివరణను పీసీసీ ద్వారా మీనాక్షి నటరాజన్‌కు చేరవేయనున్నట్లు రిపోర్టర్ వెల్లడించారు….

📄 Generate e-Paper Clip
Share This Article