తెలంగాణ /ఖమ్మం జిల్లా :
వైరా, జూలై 13 (ప్రతినిధి సత్తేనపల్లి శివ ):
వైరా నియోజకవర్గ రైతాంగానికి సాగునీటిని అందించడమే లక్ష్యంగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా ఈరోజు వైరా రిజర్వాయర్ నుండి ఆయకట్టుకు కాలువల ద్వారా జలాలను విడుదల చేసే కార్యక్రమాన్ని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఘనంగా నిర్వహించారు. రిజర్వాయర్ ఎస్కేప్ లాక్ వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి,జలాలను కాలువలకు వదిలారు. అనంతరం గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు….

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, “రైతులే ఈ దేశానికి వెన్నెముక. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వైరా ప్రాంత రైతుల సాగునీటి కష్టాలను తీరుస్తున్నాం. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుకురావడం ద్వారా వైరా ఆయకట్టు కింద ఉన్న సుమారు 30 వేల ఎకరాలకు సాగునీటి భరోసా లభించింది. ఏటా సాగునీటి కోసం పడే ఇబ్బందులకు ఇక స్వస్తి పలుకుతాం. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది,” అని స్పష్టం చేశారు…కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అన్నదాతల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి అనేక వినూత్న చర్యలు చేపడుతోందని,రైతులపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం దశలవారీగా రుణమాఫీ ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తోందని అన్నారు అంతే కాకుండా వ్యవసాయ పెట్టుబడి సాయంగా రైతులకు అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేస్తూ, సాగుకు ఇబ్బంది లేకుండా చూస్తోందని,వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం కోసం పొలాల్లో చెట్ల పెంపకాన్ని (ఆగ్రో ఫారెస్ట్రీ) ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్త విధానాలను ప్రవేశపెట్టిందని తెలిపారు …..

అదే విధంగా వ్యవసాయ బోర్లకు సోలార్ ప్లేట్ల ఏర్పాటు ద్వారా ఉచిత మరియు నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తోందని సీతారామ వంటి ప్రాజెక్టుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యంగా, కృష్ణ-గోదావరి నదుల అనుసంధానంతో సాగునీటి లభ్యతను గణనీయంగా పెంచిందని పేర్కొన్నారు…ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరావు,సర్పంచుల సంఘం మండల ప్రెసిడెంట్ శీలం చంద్రశేఖర్ రెడ్డి, విప్పలమడక సర్పంచ్ మేడా హెమీమా చక్రపాణి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నీటి విడుదల కార్యక్రమంతో రైతుల ముఖాల్లో ఆనందం వ్యక్తమవుతోంది……
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
