తెలంగాణ /ఖమ్మం జిల్లా :
చింతకాని :తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ‘రైతు ఆశీర్వాద సభ’ ప్రాంగణం వద్ద ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గమైన మధిర పరిధిలోని జగన్నాధపురం వద్ద భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. అయితే, ఈ సభకు ముందే అక్కడ వివిధ పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వైసీపీ, టిడిపి అభిమానుల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెను ప్రకంపణలు సృష్టిస్తున్నాయి….
అయితే మల్లు భట్టి విక్రమార్క దివంగత వైయస్సార్ అభిమాని కావడం, మధిర నియోజకవర్గంలో రాజశేఖరరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి బలమైన ఫాన్ బేస్ ఉండటంతో సహజంగానే వైయస్సార్ అభిమానులు మొదటి నుండి భట్టి విక్రమార్కను అభిమానిస్తుంటారు, నిజానికి మధిరలో భట్టి విక్రమార్క గెలుపులో వారిది కీలకపాత్ర అనేది నిర్వీవాదాంశం ఈ క్రమంలో చింతకాని మండలం మతెకేపల్లి నామవరంలో జరుగుతున్న “రైతు ఆశీర్వద” సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు అవుతున్నారు,ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు, నాయకులు సభ ప్రాంగణానికి వెళ్లే దారిలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లతో పాటు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, డిప్యూటీ సియం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు, ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అభిమానులు,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఫోటోలతోపాటు సియం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫొటోలతో పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.అయితే ఈ ఫ్లెక్సీలను గమనించిన అధికార యంత్రాంగం వెంటనే వాటిలో కొన్నింటిని తొలగించింది అయితే గతంలో రేవంత్ రెడ్డి పాలేరు పర్యటన సమయంలోనూ కొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు టీడీపీ జెండాలతో,జగన్ అభిమానులు వైసీపీ జెండాలతో ర్యాలీలో పాల్గొన్న ఘటనలు ఉండటం గమనార్హం….
వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు భౌగోళికంగా, సామాజికంగా ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న సామీప్యత కారణంగా ఇక్కడ టీడీపీ, వైసీపీలకు మొదటి నుంచి గట్టి పునాదులు, సానుభూతిపరులు ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే 2010 ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీగా గెలుపొందడం విశేషం, ప్రస్తుతం తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఆయా పార్టీల ప్రభావం తగ్గినప్పటికీ, అభిమానుల సందడి మాత్రం ఖమ్మం జిల్లాలో ఇంకా కనిపిస్తూనే ఉంటుంది.గత కొద్ది నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్బంగా జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం, పలువురు కార్యకర్తలు పోలీస్ కేసులతో జైళ్ళ పాలవడం జరిగింది అప్పట్లో ఈ కేసుల విషయంలో మంత్రి తుమ్మల,ఆయన కుమారుడు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం,ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి టీడీపీతో ఉన్న గత రాజకీయ అనుబంధం వల్ల ఆ పార్టీ శ్రేణులు ఆయన పట్ల ప్రత్యేక అభిమానం కనబరుస్తుంటాయి….మరోవైపు జగన్ అభిమానులు కూడా తాము ఎవరికీ తీసిపోమన్నట్లుగా జగన్ మోహన్అ రెడ్డి పట్ల అభిమానం చూపుతుంటారు,ఈ పరిణామాలు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి….
అయితే కాంగ్రెస్ పార్టీ సభకు వీళ్ళ ఫ్లెక్సీల హడావిడి ఏమిటని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, వాస్తవానికి సిద్ధాంత పరంగా, పొత్తుల పరంగా చూస్తే వైసీపీ, టిడిపి రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పార్టీలే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి బద్ధ వ్యతిరేకి అయినా బీజేపీ పార్టీతో పొత్తులో ఉంది
అయినప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభిమానం పేరుతో ప్రతి సభలో తెలుగుదేశం ఫ్లెక్సీలు,జెండాలు ప్రత్యక్షం కావడం సర్వసాధారణంగా మారింది దీంతో మొదటి నుండి కాంగ్రెస్ జెండాలు మోసి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొంత అసహనం వ్యక్తం అవుతుంది దీంట్లో భాగంగానే రెండు నెలల క్రితం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు “నలభై యేండ్ల రాజకీయ ప్రస్థానం”పేరుతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ర్యాలీ మరియు సభలో తెలుదేశం పార్టీ శ్రేణుల హడావిడితో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసౌకర్యానికి గురై సభకు దూరంగా ఉండడంతో సభ ఫెయిల్యూర్ అయిందని గుసగుసలు వినిపించాయి…..
పొత్తులు,సిద్ధాంత పరంగా కాంగ్రెస్ పార్టీకి బద్ద వ్యతిరేకమైన టీడీపీ,వైసీపీ పార్టీలు కాంగ్రెస్ పార్టీ సభల్లో అభిమానం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సబబు కాదని, ఇలా ఏర్పాటు చేయడం వలన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో గందరగోళం నెలకుంటుందని,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,వారి పార్టీ ఫ్లెక్సీలు వారి పార్టీ సభల్లో ఏర్పాటు చేసుకోవాలిగాని కాంగ్రెస్ పార్టీ సభల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు అదే విధంగా జిల్లా మంత్రులు కూడా ఇలాంటి చర్యలపట్ల అప్రమత్తంగా ఉండాలని అవకాశవాద రాజకీయాలు చేసే పార్టీలకు దూరంగా ఉండాలని కోరారు….
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
