తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి, మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు ఖమ్మంలో వైఎస్సార్ 77వ జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దయాకర్ రెడ్డితో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబి స్వర్ణకుమారి, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు…..

క్యాంపు కార్యాలయంలోనే కాకుండా పలు డివిజన్లు, గ్రామాల్లోనూ నివాళులర్పించే కార్యక్రమాలు కొనసాగాయి. ఖమ్మం నగరంలోని 16వ డివిజన్, 7వ డివిజన్లతో పాటు ఖమ్మం రూరల్ మండలం కొండాపురంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు దయాకర్ రెడ్డి స్వయంగా పూలమాలలు వేసి అంజలి ఘటించారు.ఈ సందర్భంగా తుంబూరు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ పాలనా వైభవాన్ని గుర్తుచేసుకున్నారు.ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్‌మెంట్ వంటి చారిత్రాత్మక పథకాలతో ఆయన పేదల గుండెల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు.అదే విధంగా మహానేత ఆశయాలకు అనుగుణంగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.అంతే కాకుండా ప్రభుత్వ లక్ష్యాల సాధనలో, పథకాల అమలులో పార్టీ కార్యకర్తలంతా ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు…..

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు జూకూరి గోపాలరావు, బోడా మంగీలాల్.ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిన అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్.ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు తోట వీరభద్రం.కల్లెం వెంకట్ రెడ్డి, బండి జగదీష్, డివిఆర్ బాబు, మద్ది మల్లారెడ్డి, పుల్లయ్య, లింగాల రవికుమార్, మందడపు రామకృష్ణ రెడ్డి, మందడపు మనోహర్, ఉమ్మినేని కృష్ణ, భీమనాథుల అశోక్ రెడ్డి, కొప్పెర ఉపేందర్, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏనుగు వెంకట్ రెడ్డి, షేక్ ఇమామ్, చింతమల్ల గురుమూర్తి, బోడా శ్రావణ్ కుమార్, తాళ్లూరి రాము, చంద్రు నాయక్, బాణోతు దివ్య, బట్టపోతుల సతీష్, చల్లా కృష్ణారెడ్డి, హారిక నాయుడు, మొగిలిచర్ల సైదులు, ఎయిర్‌టెల్ నర్సింహారావు, వెనిగళ్ళ నాగేశ్వరరావు, ఆటోప్రసాద్, నాగరాజు, విప్లవ్ కుమార్, మద్ది వీరారెడ్డి, వెంపటి రవి, పంతులు నాయక్, చింతమల్ల రవి, బండి సతీష్, కన్నెటి అనిల్, తంబి, కరాటే వేణు, ఉపేందర్, రాజు, తిరుపతమ్మ, రుడావత్ రమాదేవి, కన్నెగంటి రావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులు అర్పించారు….
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
