తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం సిటీ :ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా, పైరవీలకు అడ్డాగా మారింది. ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనులన్నీ పక్కదారి పడుతుండగా, ఖమ్మం అర్బన్ మండల కార్యాలయంలో అన్నీ తామై చక్రం తిప్పుతున్నారు ఓ ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ మరో జీపివో.జనన,మరణ ధ్రువీకరణ పత్రాలనుండి మొదలుకుని ఆదాయం, కులం, ఫ్యామిలీ సర్టిఫికెట్ల జారీలో వీరు చెప్పిందే వేదంగా నడుస్తుంది,ఒక విధంగా చెప్పాలంటే వీరి ఆగడాలతో కార్యాలయ వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని కార్యాలయ సిబ్బందితో పాటు నిత్యం పనుల కోసం కార్యాలయానికి వచ్చి పోయే సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, రేషన్ కార్డుల జారీలో అనర్హులకు ఇచ్చాడంటూ పెద్ద వివాదం నెలకున్న క్రమంలో సదరు కంప్యూటర్ ఆపరేటరును ఇంకా కొనసాగించడంపై ప్రజల్లో అనేక అనుమానాలు రేఖేత్తుతున్నాయి…..
క్రింది స్థాయి అధికారులను కాదని.. డైరెక్ట్ ఫైల్స్ పుష్ చేస్తున్న వైనం…..
రెవెన్యూ విధుల్లో క్షేత్రస్థాయి పరిశీలన అత్యంత కీలకం. కానీ ఇక్కడ ఆర్ఐ (RI) లకు తెలియకుండానే ఫైల్స్ పుష్ అవుతున్నాయని తెలిసి కార్యాలయ సిబ్బంది లబోదిబోమంటున్నారు. ఆర్ఐ ల ప్రమేయం లేకుండా, వారి రిపోర్టులతో కనీస సంబంధం లేకుండానే డైరెక్టుగా తహసీల్దార్ సంతకం పెట్టించి, కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా ఆర్డీవో (RDO) ఆఫీసుకు జీపివో ఫైల్స్ పుష్ చేపిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి,అంతే కాకుండా గత తహసీల్దార్ పెంచి పోషించిన మొక్క నేడు పెద్ద మానుగా మారి సామాన్య కార్యాలయ సిబ్బందికి తలనొప్పిగా మారాడని తలలు పట్టుకుంటున్నారు… గత తహసీల్దార్ నియమించుకున్న వ్యక్తిని ఇంకా ప్రస్తుత తహసీల్దార్ కొనసాగించడంతో పాటు, అతనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటనే విషయం అంతుబట్టడం లేదని,కార్యాలయం ఉద్యోగులు. క్రింది స్థాయి సిబ్బందిని కాదని తహసీల్దారులు ఒక ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటరుకు ఎందుకు అంత ప్రాధాన్యత కల్పిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొందని.అత్యంత కాన్పిడెన్షియల్ గా ఉండాల్సిన తహసీల్దార్ డిజిటల్ కీ మరియు కీలకమైన ఫైళ్లను ఒక ప్రైవేట్ ఆపరేటర్ చేతిలో ఎలా పెడుతున్నారో, దాని వెనుక ఉన్న మతలబు ఏమిటో అంతు చిక్కని రహస్యంగా మారిన వైనం పలు అనుమానాలకు తావిస్తోందని క్రింది స్థాయి సిబ్బంది వాపోతున్నారు….
మల్లెమడుగు భూములపైనే ఎందుకంత ప్రేమ?
అర్బన్ మండల కార్యాలయంలో వందల సంఖ్యలో పెండింగ్ ఫైల్స్ ఉండగా.. కేవలం వివాదస్పదమైన మల్లెమడుగు రెవిన్యూ పరిధిలోని భూముల ఫైల్స్ మాత్రమే హుటాహుటిన క్లియర్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది….. ఈ మొత్తం వ్యవహారంలో మల్లెమడుగు జీపీవో, ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ కలిసి వివాదాస్పద ఫైళ్లను ముందు పెట్టి పైరవీలకు తెరలేపినట్లు అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి….గత తహసీల్దార్ సంతకం పెట్టిన మల్లెమడుగు రెవిన్యూ పరిధిలోని వివాదాస్పద 186 సర్వే నెంబర్లో మూడు ఎకరాల భూమికి పట్టాదార్ పాస్ పుస్తకాల మంజూరి కోసం..సదరు తహసీల్దార్ తో చేతులు కలిపి, ప్రస్తుత తహసీల్దార్ తో థంబ్ వేపించడంలో మల్లెమడుగు జీపివో,కంప్యూటర్ ఆపరేటర్ కీలకపాత్ర వహించినట్లు సమాచారం.అంతే కాకుండా పట్టాదార్ పాస్ పుస్తకాల మంజూరిలో భాగంగా 2008,2009 మధ్య కాలంలో ఒకసారి ల్యాండ్ కన్వర్షన్ (Land Conversion) పూర్తి అయ్యాక, రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి వందల ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యాక కూడా, ఆ స్థలాన్ని ఇంకా వ్యవసాయ భూమిగా చూపిస్తూ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన మల్లెమడుగు జీపివో బండారం ఈ విషయం వెలుగులోకి రావడంతో బట్టబయలైంది…..
బదిలీ అయినా.. ఆగని పాత అధికారి పెత్తనం….
ప్రస్తుత తహసీల్దార్ పక్క జిల్లా నుండి రావడంతో, ఖమ్మం జిల్లా భౌగోలిక పరిస్థితితులపై ఆయనకు అవగాహనా లేకపోవడాన్ని కొందరు ఆసరాగా తీసుకున్నారు. దీనిని క్యాష్ చేసుకుంటూ మల్లెమడుగు జీపీవో, కంప్యూటర్ ఆపరేటర్ ను అడ్డం పెట్టుకుని గత తహసీల్దార్ అర్బన్ మండల కార్యాలయంలో చక్రం తిప్పుతున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన బదిలీపై వెళ్లినా అర్బన్ మండల కార్యాలయంలో ఆయన పెత్తనమే సాగుతుందని క్రింది స్థాయి సిబ్బంది అంటున్న మాటలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.వాస్తవానికి అసలు కంప్యూటర్ ఆపరేటర్ చేస్తున్నది ఔట్ సోర్సింగ్ ఉద్యోగా? లేక కాంటాక్ట్ ఉద్యోగా? అయితే అతని జీతబత్యాలు ఏ ఖాతా నుండి ఇస్తున్నారనేది అంతు చిక్కని రహస్యంగా మారింది…..
కలెక్టర్ గారూ.. కాస్త దృష్టి సారించండి…..
ఒకవైపు SIR, మరో వైపు నిత్యం జిల్లా అభివృద్ధి కోసం పరితపిస్తూ కలెక్టర్ సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతుంటే.. క్రింది స్థాయిలో కొంతమంది తహసీల్దారులు మాత్రం తమ కార్యాలయాలను అవినీతికి అడ్డాగా మారుస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అవినీతికి పాల్పడే అధికారులపై ద్రుష్టిసారించడంతో పాటు అర్బన్ మండల కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనానికి చెక్ పెట్టి పరిస్థితిని చక్కదిద్దాలను ప్రజలు, మేధావులు కోరుతున్నారు……
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
