ఖమ్మంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల అరెస్ట్!!

Pathi Sreenivas Rao
2 Min Read

ఖమ్మం, మే 26:ఖమ్మం నగరంలో గత కొంతకాలంగా వరుస వాహన దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను ఖమ్మం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన రెండు ఆటోలు, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు…..

మంగళవారం ఖమ్మం టేకులపల్లి వంతెన వద్ద ఎస్సై వి. రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో వారు నగరంలో వాహన చోరీలకు పాల్పడుతున్నట్లు నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 3,30,000 విలువైన రెండు ఆటోలు, రెండు మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు….

సిపిఐ ఆఫీస్ వద్ద ఒక మోటార్ సైకిల్ చోరీ,లిటిల్ స్టార్ హాస్పిటల్ వద్ద ఆగి ఉన్న ఒక ఆటో చోరీ,బ్రాహ్మణ బజార్లోఒక ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న పల్సర్ బైక్ అపహరణ అంతే కాకుండా నెహ్రూ నగర్ ఎంఎన్ఆర్ (MNR) హాస్పిటల్ ముందు ఉన్న మరో ఆటో చోరీతో పాటు నిందితులు నగరంలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి
ఈ వాహనాలను అపహరించినట్లు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు,చోరీలకు పాల్పడినవారంతా ఆటో డ్రైవర్లుగా పోలీసులు గుర్తించారు….

నునావత్ సాయికుమార్ (ఖమ్మం పెద్ద తండా)
బానోత్ సాయికుమార్ (ఖమ్మం పెద్ద తండా)
రేపల్లి శ్రీను అలియాస్ రాజు (వి.యం. బంజర)
వీరిలో రేపల్లి శ్రీనుపై గతంలోనూ ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.పట్టుబడిన ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ స్పష్టం చేశారు. వాహన తనిఖీల్లో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న ఎస్సై రమేష్‌ను, సిబ్బందిని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు అభినందించారు….

📄 Generate e-Paper Clip
Share This Article