తెలంగాణ /హైదరాబాద్:
హైదరాబాద్: త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీలు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడంపై ఇక్కడ తీవ్రమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం ఎవరి అదుపాజ్ఞల్లో ఉండబోతోంది, ఎవరి ఆధిపత్యం నడవబోతోంది అని తేల్చేవిగా ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికలను తెలంగాణ సమాజం అభివర్ణిస్తోంది ఈ క్రమంలోనే జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయ దుమారానికి దారితీసింది….
పవన్ కళ్యాణ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం…
పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగుపెట్టడంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు ప్రెస్ మీట్ వేదికగా పవన్ కళ్యాణ్‌పై ఆయన విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బాధతో 11 రోజుల పాటు అన్నం మానేశానని గతంలో చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రశ్నించారు, కోనసీమలో కొబ్బరి తోటలు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ళ దిష్టే కారణమని నాడు వ్యాఖ్యానించిన విషయాన్ని పొన్నం గుర్తు చేశారు,బీజేపీ నుంచి ప్యాకేజీ ముట్టింది కాబట్టే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి మళ్లీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు “కూట్లో రాయి తీయలేని వ్యక్తి ఏట్లో తీస్తాడా… ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉండి అక్కడ ఏదైనా చేసుకో కానీ, తెలంగాణలో కాదు” అంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు….
టీడీపీపై కాంగ్రెస్ సాఫ్ట్ కార్నర్?
పవన్ కళ్యాణ్‌ను అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ మంత్రులు, తెలుగుదేశం పార్టీ (TDP) విషయంలో మాత్రం భిన్నమైన వైఖరిని అవలంబిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి,మహానాడు వేదికగా టీడీపీ నాయకులు తెలంగాణ పదాన్ని, ఇక్కడి విద్యాశాఖ మంత్రిని దూషించినా, నారా లోకేష్ తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించినా కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉంటోందని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు,ఇటీవలే హైదరాబాద్ మైత్రీవనం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జెండాల కంటే టీడీపీ జెండాలు, చంద్రబాబు నినాదాలే ఎక్కువగా వినిపించాయి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… 2023లో ప్రజా ప్రభుత్వం ఏర్పడటానికి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ మద్దతుదారులే కారణమని బహిరంగంగా ఒప్పుకోవడం గమనార్హం, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కూటమి అట్టర్ ప్లాప్ అయినప్పటికీ, రేవంత్ రెడ్డి ఇప్పుడు టీడీపీకి అంత ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేంటని తెలంగాణవాదులు అడుగుతున్నారు…..
ఏపీలో పొత్తు.. తెలంగాణలో ఫ్రెండ్లీ?
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా అధికారంలో ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ వస్తున్నాడని కాంగ్రెస్ మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కానీ అదే కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి మాత్రం హైదరాబాద్‌లో దారులు తెరిచే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు కాంగ్రెస్‌కే ఓటు వేస్తారనే నమ్మకంతోనే సీఎం రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ను మాత్రమే టార్గెట్ చేస్తూ టీడీపీపై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి,మొత్తానికి, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ పరోక్ష నిర్ణయాల వల్ల హైదరాబాద్ మహానగరం మళ్లీ టీడీపీ మద్దతుదారుల ఆధిపత్యంలోకి వెళ్తుందా? లేక తెలంగాణ నాయకత్వం చేతుల్లోనే ఉంటుందా? అనేది రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తేలనుంది….
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
