తెలంగాణ/ఖమ్మం జిల్లా:
ఖమ్మం సిటీ :మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గానికి రాష్ట్ర మున్నూరు కాపు సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొదిల రవికుమార్ తన నివాసంలో ఘనంగా సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.ఇటీవల నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు శీలంశెట్టి వీరభద్రం, గౌరవ అధ్యక్షులు కొత్తా సీతారాములు, ప్రధాన కార్యదర్శి పసుపులేటి దేవేందర్, కోశాధికారి మడూరి పూర్ణ, మున్నూరు కాపు యూత్ అధ్యక్షులు తోట రమేష్, యూత్ కార్యదర్శి మాటేటి కిరణ్, మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ తదితరులను పొదిల రవికుమార్ శాలువాలతో ఘనంగా సత్కరించారు….

వద్దిరాజు రవిచంద్ర సహకారంతో ముందుకు: పొదిల రవికుమార్….
కార్యక్రమాన్ని ఉద్దేశించి పొదిల రవికుమార్ మాట్లాడుతూ… నూతన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ, రాజకీయ పార్టీలకు అతీతంగా పని చేస్తూ కులబాంధవులందరినీ ఏకం చేయాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపు సంఘాన్ని మరింత ముందుకు నడిపించేందుకు అందరూ సహకరించాలని కోరారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినప్పటికీ ఖమ్మం జిల్లాలో ఇంత వరకు నామినేటెడ్ పదవుల్లో గానీ, పార్టీ సంస్థాగత పదవుల్లోగాని ఎటువంటి ప్రాధాన్యత లేదని,ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోవడం ఖాయమని అన్నారు,అంతే కాకుండా ఖమ్మం నగరంలో పెద్ద కులాల్లో ఒకటైన మున్నూరు కాపు కులానికి రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అలాగే రాష్ట్ర గౌరవ అధ్యక్షులు MP వద్దిరాజు రవిచంద్ర దిశానిర్దేశంలో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు…..

సంఘటితంగా ముందుకు సాగుతాం: నూతన కార్యవర్గం….
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ… భవిష్యత్తులో అందరినీ కలుపుకొని పోతూ, మున్నూరు కాపు కులాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. మున్నూరు కాపు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు (MP) వద్దిరాజు రవిచంద్ర గారి సహకారంతో సంఘాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు….ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు, కార్పొరేటర్స్ చామకూరి వెంకట నారాయణ, ఆకుతోట రాజశేఖర్, పద్మం వెంకటేశ్వర్లు, ముత్యం కొండల్ రావు, వాసంశెట్టి రామారావు, గడిల మధు, బండారు శ్రీనివాస్ రావు, చిట్టెంశెట్టి పరమేశ్వరరావు, బొమ్మిశెట్టి రమేష్, తిరుమలశెట్టి జయప్రకాష్, GVVL. నరసింహరావు, కాసిన్ని శ్రీనివాస్ రావు, చౌడం నరసింహరావు, వాకాటి రమేష్, సంపటం నరసింహ రావు, నాగిశెట్టి రాధాకృష్ణ, నానబాల హరీష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…..
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట న్యూస్, ఖమ్మం:9703973456
