BRS “TO” TRS ఆసక్తి రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు??

Pathi Sreenivas Rao
2 Min Read


టిఆర్ఎస్ మళ్ళీ టిఆర్ఎస్ గా మారబోతుందా ?
ఆ ప్రక్రియ కూడా మొదలయిందా ?
స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటివల చేసిన వ్యాఖ్యలు దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి,టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా రూపాంతరం చెందాక నష్టపోయామని కేటీఆర్ మాట్లాడిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారాయి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో ఉద్యమ పార్టీగా మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రాన్ని సాధించి తొలి తెలంగాణలో అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది,ఆ తర్వాత జాతీయ స్థాయిలో భారత రాష్ట్ర సమితిగా మార్చడంతో ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారాన్ని కోల్పోయింది, అంతేకాకుండా ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఘోర ఓటమి ఎదురైంది, ఈ నేపథ్యంలో పార్టీ పేరు మార్పుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

ముఖ్యంగా ఉద్యమ కాలంనుండి  తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు రాష్ట్ర ప్రజల మనసుల్లో ప్రముఖంగా నాటుకు పోయింది,కానీ భారత రాష్ట్ర సమితి పేరు మార్చడంతో ఆది ప్రజలకు సరిగ్గా కనెక్ట్ కావడం లేదనే వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తుంది, ఈ నేపథ్యంలో ఎలర్ట్ అయిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు ముఖ్య నాయకులు,పార్టీ శ్రేణులతో చర్చలు జరపడం,పార్టీ పేరు మార్పు తన వ్యక్తిగత అభిప్రాయం అంటూనే పేరు మార్పును బలంగా ప్రస్తావించడంతో బిఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీగా మార్చడం కోసం బారీ కసరత్తు మొదలు పెట్టినట్టుగా ప్రచారం సాగుతుంది,ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టడమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం, టిఆర్ఎస్,బిఆర్ఎస్ గా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఎవరికి కేటాయించక పోవడంతో పేరు మార్పుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తుంది….

పార్టీ పేరు మారితే రాజకీయంగా నష్టం అని గతంలో కొంతమంది నేతలు కామెంట్ చేసినప్పటికీ అప్పట్లో వారి మాటలను కేసీఆర్ పెడచెవిన పెట్టడంతో తీవ్రమైన ఓటమికి గురి కావలసి వచ్చింది,దీంతో పార్టీ మార్చడం వలన మేలు జరుగుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో పేరు మార్పుపై ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు,దీనిపై మరింత క్లారిటీ రావాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందేనని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి….

📄 Generate e-Paper Clip
Share This Article