తెలంగాణ/ఖమ్మం జిల్లా/క్రైమ్:
ఆన్లైన్ ట్రేడింగులో పెట్టుబడి పెడితే అధిక లాభాలు
వస్తాయని నమ్మించి, సుమారు 2 కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులలను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు ఆంధ్ర ప్రదేశ్ లోని వెస్ట్ గోదావరి జిల్లా, తణుకు పట్టణంలో అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మీడియాకు తెలిపారు…..

నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు….
కేసు యొక్క పూర్వపరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యాపార వేత్తకి వాట్సాప్ లో పరిచయమైన వ్యక్తులు ఆన్లైన్ లో FX PRO అనే ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి వాట్సప్ ట్రేడింగ్ లింకుల ద్వారా సుమారు 2 కోట్ల రూపాయలు సైబర్ మాయగాళ్లు కాజేసినట్లు పోలీసులు తెలిపారు……
ఈ కేసులో విచారణలో తేలిన అంశాలనుబట్టి చూస్తే సుమారు ఏడు లక్షలు రూపాయిలు ఎండి. సాదిక్ (35సం), శ్యామ్ బాబు (21సం) వ్యక్తిగత ఖాతాల్లోకి జమ అయినట్లు తేలడంతో ఇరువురిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తణుకులో అరెస్టు చేసి ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హజరు పరచడంతో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు…
ఈ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్ డిఎస్పీ, CH.R.V. ఫణిందర్, ఇన్స్పెక్టర్ కొండపర్తి నరేశ్ ,ఎస్సై రoజిత్ కుమార్, కానిస్టేబుళ్లు వెంకట కృష్ణరావు ,కిషన్ రావు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు….
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
