తెలంగాణా/ఖమ్మం జిల్లా:
ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూములపై అక్రమ వ్యాపారాలకు,ఆక్రమణలకు పాల్పడడంతో పాటు నిరుపేదల దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడిన మరో నలుగురు కీలక నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఖమ్మం సిటీ ఏసిపి రమణమూర్తి,ఖానాపురం హవేలీ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ ఒక ప్రకటనలో వెల్లడించారు,నిందితులపై Cr. No. 101/2026, U/S 111 (1) (ii), 318(4) r/w 3(5) of BNS 2023 క్రింద గతంలో ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు ….
నలుగురు కీలక నిదితులకు పద్నాలుగు రోజుల రిమాండ్…
వెలుగుమట్ల భూదాన్ భూముల కేసులో కీలక నిందుతులైన 1.కల్తీ రామచంద్రయ్య 2. బాణాల లక్ష్మణ చారి 3. చిప్పనపల్లి వీరయ్య 4. కుంజా కృష్ణయ్య ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు,ఆయా కేసుల్లో నిందితుల అక్రమాలపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు,అదేవిదంగా ఈ కేసు లో ప్రధాన నిందుతులైన 1) పోలెబోయిన ముత్తయ్య, 2)బల్లి శ్రీనివాస్, 3)కొప్పెర వెంకన్న, 4)కొట్టే బసు,5) సంపంగి వెంకటాచలం, లను మెజిస్ట్రేట్ అనుమతి తో పోలీస్ కస్టడీపై తీసుకొచ్చి విచారించిన అనంతరం సోమవారం తిరిగి జ్యుడీషియల్ రిమాండుకు తరలించడం జరిగిందని అన్నారు…..
అక్రమ వసూళ్ల నిందితుల ఆస్తులు స్వాదీనం చేసుకుంటాం….
ఈ కేసులో ఇప్పటి వరకు పదహారు (16) మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని, నిందితుల బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామని,అంతే కాకుండా పేద ప్రజల దగ్గర అక్రమంగా వసూళ్లు చేసిన డబ్బుతో ఎక్కడెక్కడ స్థిరారస్తులు,భూములు కొనుగోలు చేశారనే అంశం మీద ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతుందని,అక్రమ అస్తులను గుర్తించి వాటిని చట్ట ప్రకారంగా స్వాధీనం పర్చుకొనే ప్రక్రియ త్వరలో ప్రారంభం అవుతుందని ఈ సందర్భంగా ఏసీపీ రమణమూర్తి తెలియజేశారు…
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
