జనం ముచ్చట, ఖమ్మం జిల్లా:
ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సతీమణి శ్రీమతి మాధురి పాలేరు,మధిర నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు,ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఆడబిడ్డ ఆత్మగౌరవంతో ఎదిగినప్పుడే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు,తొలుత నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో ఐకేపీ మహిళలు, ఆశా వర్కర్లతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా కాసేపు మహిళలతో సరదాగా గడిపారు,ఈ సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని, ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు,అనంతరం ఖమ్మం టీఎన్జీఓస్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మంత్రి పొంగులేటి సతీమణి మహిళా ఉద్యోగుల సేవలను కొనియాడారు…..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేలకొండపల్లి మండలం ఐకెపి మహిళలు,ఆశా వర్కర్లతో కలసి కేక్ కట్ చేసిన మంత్రి పొంగులేటి సతీమణి…..
తదనంతరం మంత్రి పొంగులేటి సతీమణి పలు వివాహ వేడుకలకు హాజరై వధూవరులను దీవించారు,పైనంపల్లిలో మారగాని ఉపేందర్ గౌడ్ కుమారుడి వివాహం, ఏదులాపురంలో ఓరుగంటి పిచ్చిరెడ్డి కుమారుడి వివాహం, యర్ర ఉపేందర్ రెడ్డి కుమారుడి రిసెప్షన్, ఖమ్మంలో బండి శ్రీనివాసరావు కుమారుడి వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. మోహన్ రెడ్డి గృహ ప్రవేశ వేడుకకు హాజరయ్యారు.అలాగే ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో బొగ్గుల నరేంద్ర రెడ్డి కుమారుడి అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని దీవించారు…..

వివాహ వేడుకల్లో వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి సతీమణి మాధురి….
అదే విధంగా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామంలో గడ్డం శివనాగిరెడ్డి కుటుంబ సభ్యులను మాధురి రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. “ఏ కష్టం వచ్చినా మేమున్నామనే నమ్మకంతో ఉండండి.. మంత్రి పొంగులేటి మీకు ఎల్లవేళలా అండగా ఉంటారు” అని భరోసా ఇచ్చారు. పర్యటన పొడవునా మంత్రి సతీమణిని మహిళలు ఆత్మీయంగా ఆహ్వానించి అభినందనలు తెలిపారు…..

టీఎన్జీవోస్ భవన్‌లో జరిగిన మహిళా దినోత్సవంలో మహిళలతో కలసి వివిధ ఆటల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి సతీమణి….
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
