కొలువు దీరిన ఏదులాపురం మున్సిపాలిటీ పాలక వర్గం!!

Pathi Sreenivas Rao
2 Min Read
ఏదులాపురం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నికైన పోకబత్తిన అనిత, తమ్మినేని నవీన్....

ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించిన వార్డు కౌన్సిల‌ర్ల‌ ప్రమాణ స్వీకారం మరియు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమం స్థానిక ఖమ్మం రూరల్ ఎం.పీడీ.ఓ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్ మున్వర్ అలీ ఆధ్వర్యంలో జరిగింది, జరిగింది……

కార్యక్రమంలో మొదట వివిధ వార్డుల్లో ఎన్నికైన 32 మంది వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు,అనంతరం చైర్‌ప‌ర్స‌న్‌, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టడం జరిగింది, చైర్మన్ ,వైస్ ఛైర్మన్ ఎన్నిక సింగిల్ సెట్ నామినేషన్లు దాఖలు కావడంతో చైర్మన్,వైస్ ఛైర్మన్ ఎన్నిక లంచనప్రాయంగా మారింది,ఏదులాపురం మున్సిపాలిటీ తొలి చైర్ పర్సన్ గా 23వ వార్డు కౌన్సిలర్ పోక‌బత్తిని అనిత,వైస్ చైర్మన్‌గా 14వ వార్డు కౌన్సిలర్ త‌మ్మినేని నవీన్ ను మెజారిటీ వార్డు కౌన్సిలర్లు ఎన్నుకొన్నారు, కార్యక్రమం అనంతరం అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ ఆధ్వర్యంలో మొదటి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు….

చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం
చైర్మన్ అనిత,వైస్ ఛైర్మన్ తమ్మినేని నవీన్,కౌన్సిలర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి అభినందించారు,ఆ తరువాత జరిగిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పోకబత్తిన అనిత మాట్లాడుతూ ఏదులాపురం మున్సిపాలిటీ తొలి చైర్మన్ గా అవకాశం ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి,తనను గెలిపించిన 23 వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు, మంత్రి పొంగులేటి దీవెనలతో మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు,వైస్ ఛైర్మన్ తమ్మినేని నవీన్ మాట్లాడుతూ తొలి మున్సిపాలిటీకి వైస్ ఛైర్మన్ గా అవకాశం కల్పించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి, దయాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు,నన్ను గెలిపించిన తెల్ధారుపల్లి గ్రామ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాయని,స్వర్గీయ తమ్మినేని కృష్ణయ్య ఆశయాలను కొనసాగిస్తానని,తెల్ధారుపల్లి అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు….

అదే విధంగా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం,చైర్‌ప‌ర్స‌న్‌,వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ ముష్కరాజ్, ముదిగొండ సిఐ మురళి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు…..

📄 Generate e-Paper Clip
Share This Article