ఖమ్మం జిల్లా:Jan:30:1:2026
ఫిబ్రవరి 11 న జరిగే ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియలో భాగంగా చివరి రోజు కావడంతో నామినేషన్లు ఊపందుకున్నాయి,ఈ సందర్భంగా తెల్దారుపల్లి గ్రామంలోని మూడు వార్డులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు,14 వ వార్డు కౌన్సిలరుగా తమ్మినేని నవీన్,15 వ వార్డు కౌన్సిలరుగా తమ్మినేని మంగతాయి,17 వ వార్డు కౌన్సిలరుగా ఇనుప రాంబాబు నామినేషన్లు దాఖలు చేశారు….

స్వర్గీయ తమ్మినేని కృష్ణయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన తుంబూరు దయాకర్ రెడ్డి, కుటుంబ సభ్యులు….
తొలుత దివంగత తమ్మినేని కృష్ణయ్య చిత్రపటానికి నివాళులు అర్పించి అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీగా బయల్దేరారు,ఈ ర్యాలీలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డితో పాటు పలువురు జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు….

15 వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న స్వర్గీయ తమ్మినేని కృష్ణయ్య సతీమణి మంగతాయి….
ఈ సందర్భంగా జరిగిన సభలో దయాకర్ రెడ్డి మాట్లాడుతూ
నిజమైన సోషలిస్టు పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని,మహిళకు ఉచిత బస్ సౌకర్యం,నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు,200 వందల యూనిట్లలోపు ఉచిత కరెంట్ వంటి అనేక పథకాలు నిరాటంకంగా అమలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందని అందుకే అసలైన సోషలిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు,మిగతా పార్టీలన్నీ తమ తమ వ్యక్తిగత స్వార్థాల కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీలని,కొన్ని వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీనీ బూర్జువా పార్టీగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నాయని,ఒక విధంగా చెప్పాలంటే మహిళల కోసం,రైతుల కోసం,పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు…..

అదే విధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సారథ్యంలో జరగబోయే ఏదులాపురం మున్సిపాలిటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని,తెల్దారుపల్లి గ్రామ పరిధిలోనీ మూడు వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులకు మీ అమూల్యమైన మైన ఓటు వేసి గెలిపించాలని అదే స్వర్గీయ తమ్మినేని కృష్ణయ్యకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు, త్వరలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,సున్నితమైన గ్రామం కావడంతో
తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్, ఖమ్మం రూరల్ ఎస్సై రాయుడు ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు……
Pathi Srinivasa Rao:970397345
