ఆంధ్రాలో పోలీస్ సింగం,18 సంవత్సరాల సర్వీసులో 30 బదిలీలు !!

Pathi Sreenivas Rao
2 Min Read

కడప జిల్లా,ప్రొద్దుటూరు వన్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీరామ్బ దిలీ వ్యవహారం నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది,సిఐ శ్రీరామ్ బదిలీపై సోషల్ మీడియాలో అధికార పార్టీ నాయకులపై నెటిజన్లు మండి పడుతున్నారు, నిజాయితీ గల ఆఫీసర్లను పని చేయనివ్వరా అంటూ తిట్లు, శాపనార్థాలు పెడుతున్నారు,బాధ్యతలు స్వీకరించిన 40 రోజుల్లోపే బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది,ఆయనకు బదిలీలు కొత్త కాదు 2007లో ముదిగుబ్బ ట్రైనీ ఎస్ఐగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన శ్రీరామ్ తన 18 సంవత్సరాల పొలీస్ సర్వీసులో రికార్డు స్థాయిలో 30 సార్లు బదిలీకి గురికావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది,అంటే సగటున ఏడాదికి రెండు సార్ల చొప్పున ఆయన బదిలీ అవ్వడం విశేషం, ప్రస్తుతం ఈ బదిలీ పోలీస్ వర్గాల్లో మరియు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది…….

విధుల్లో జాయిన్ అవుతున్న సిఐ శ్రీరామ్…

ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, శ్రీరామ్ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా తన విధులను నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్నారు,ముఖ్యంగా అసాంఘిక శక్తులను నియంత్రించడానికి ఆయన కొన్ని ప్రయత్నాలు చేశారు, కేవలం 40 రోజుల్లోనే రౌడీలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు మద్యం షాపులు, మట్కా, జూదాలపై కఠినమైన ఆంక్షలు విధించారు,రౌడీషీటర్లు, క్రికెట్ బుకీలు, గతంలో ఎన్నడూ పోలీసుల ముందుకు రాని పాత కేసుల్లోని నిందితులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారంగా మద్యం విక్రయిస్తున్న మద్యం దుకాణాలపై ఆయన నిశితంగా నిఘా ఉంచి,వాటిని నియంత్రించడానికి చర్యలు తీసుకున్నారు అంతే కాకుండా ఇప్పటి వరకు మీరు ఏమి చేశారనేది నాకు అనవసరం,ఇపుడు నేనొచ్చా మీ రౌడీయిజం, ఇల్లీగల్ దందాలు ఆపండి లేదా ఊరు విడిచి వెళ్ళండి అంటూ తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు,దీంతో సిఐ శ్రీరామ్ నీతి, నిజాయితీ అధికార పార్టీ నాయకులకు కంటగింపుగా మారింది సీన్ కట్ చేస్తే బాధ్యతలు స్వీకరించిన 40 రోజులకే ఆయనపై బదిలీ వేటు వేశారు…..

ఈ బదిలీ వెనుక రాజకీయ ఒత్తిళ్ళు పని చేశాయని, ముఖ్యంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి లాంటి నేతలను కలవకపోవడం,లంచాలకు దూరంగా ఉండటం ,ఇతర సీఐలు ఎమ్మెల్యేనీ,ఆయన కొడుకును కలిసినా శ్రీరామ్ మాత్రం వారిని కలవకుండా పనిపై దృష్టి పెట్టారు,పోలీసులకు బదిలీలు కొత్త కావొచ్చు కానీ తుచ్ఛమైన పోస్టింగులు కోసం మంత్రులు ,ఎమ్మెల్యేల బర్త్ డేలకు,వారి భార్యలు,కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ల బర్త్ డేలకు బొకేలు,కేకులు కటింగులు చేసి వాళ్ళ కాళ్ళ ముందు సాగిలబడే పోలీసులున్న సమాజంలో,మంత్రో,మంత్రి కొడుకో,మంత్రి చెంచాలో,ఎమ్మెల్యేనో పోన్ చేస్తే వణికిపోయి అక్రమ కేసులు బనాయించే పోలీసులున్న ఈరోజుల్లో తోటి సిఐలు పోయి లోకల్ ఎమ్మెల్యేని కలిసినా నువ్వు మాత్రం ఆయన్ని కలవకుండా నీ పనిలో నిమగ్నం అయ్యావు చూడు అపుడే
నువ్వు ప్రజల దృష్టిలో హీరో అయ్యావు హ్యాట్సాఫ్ సిఐ శ్రీరామ్, హ్యాట్సాఫ్…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment