హైదరాబాద్:Jan:25:1:2026
ABN ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు
మద్దతుగా ఖమ్మం జిల్లా “కమ్మ మహాజన సంఘం” రంగంలోకి దిగింది, రాధాకృష్ణపై విమర్శలు చేస్తున్న వారికి బహిరంగ లేఖ పేరుతో వార్నింగ్ ఇచ్చింది, ఆర్కే మీద విమర్శలు చేసిన వారికి ప్రజాస్వామ్యయుతంగా బుద్ధి చెబుతామని హెచ్చరిక జారి చేసింది,ఈ హెచ్చరికను ఆంధ్రజ్యోతి తన న్యూస్ వెబ్సైట్ లో ప్రచురించిందంటే వేమూరి రాధాకృష్ణకు కమ్మ సంఘం మద్దతుగా నిలవడాన్ని ఆంధ్రజ్యోతి కూడా స్వాగతిస్తుందని
స్పష్టంగా అర్థమవుతుంది….
ఇటీవల తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
మీడియా సమావేశం ఏర్పాటు చేసి బొగ్గు గనుల టెండర్ల విషయంలో రాధాకృష్ణపై కొన్ని విమర్శలు చేశారు, తెలంగాణలో బొగ్గు గనులను తమకు అనుకూలంగా ఉన్నవారికి ఇప్పించుకోవడం కోసం ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరితో కలిసి భట్టి విక్రమార్క కలిసి కుట్ర చేస్తున్నారని రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక కథనం వ్రాశారు, దానిమీద మీడియా సమావేశం ఏర్పాటు చేసిన భట్టి విక్రమార్క రాధాకృష్ణపై చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు,ఒక సందర్భంలో రాధాకృష్ణ నేను తేల్చుకుంటాం అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు,నేను దివంగత వైయస్ రాజశేఖరరెడ్డికి
నేను ముఖ్య అనుచరుణ్ణి కాబట్టి వైయస్ మీద ఉన్న కోపంతో
నన్ను రాజకీయంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు, రాధాకృష్ణ ఈ కథనం వ్రాయడం వెనుక ఎవరున్నారో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలుస్తాను,ఈ రాష్ట్రం మీద, తెలంగాణ వనరుల మీద కొన్ని రాబందులు,గద్దలు, వ్యవస్థీకృత నేరగాళ్లు కన్నేశారు,నేను బాధ్యతల్లో ఉన్నంత కాలం వారి ఆటలు సాగనివ్వను అని భట్టి విక్రమార్క తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు….
కమ్మ మహాజన సంఘం విడుదల చేసిన లేఖలో కొంత భాగం…
బాడుగ మేధావులారా, కుహానా జర్నలిస్టులారా ఖబడ్దార్!! రాధాకృష్ణ గారిపై కులం పేరుతో అవాకులు చవాకులు పేలితే కమ్మ కులం పౌరుషం ఏమిటో చూపిస్తాం, ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెబుతాం,భట్టి విక్రమార్క నువ్వు కమ్మ వాళ్ల మీద విషం కక్కుతున్నావు నీకు దమ్ముంటే ని 30% కమిషన్ మీద స్పందించాలి ఆంధ్ర జ్యోతి ఏబీ.ఎన్ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ గారి పై ప్రెస్ మీట్లు పెట్టీ యూట్యూబ్ చానల్స్ లో కమ్మ కులం పై అడ్డగోలుగా వాగుతున్నారు,మా కమ్మ జాతి పౌరుషానికి ప్రతీకగా నిలిచిన రాధాకృష్ణ గారికి మద్దతుగా మీ మధిర నియోజక వర్గంలో మా కమ్మ వారి సత్తా చూపాలా మీరే విజ్ఞత తో ఆలోచన చేయాలి…ఇట్లు కమ్మ మహాజన సంఘం ఖమ్మం…
ఆ తరువాత భట్టి విక్రమార్కకు అనుకూలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభించింది, రాధాకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తూ భట్టి విక్రమార్కను టార్గెట్ చేస్తున్నారు, పూర్తి పక్షపాత వైఖరితో భట్టి విక్రమార్క మీద వార్తా కథనాలు వ్రాస్తున్నాడనే విమర్శలు వచ్చాయి,ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కుల ప్రస్తావన తెచ్చి విమర్శలు చేశారేమో తెలియదు గానీ ఖమ్మం కమ్మ మహాజన సంఘం డైరెక్టుగా రంగంలోకి దిగి నేరాన్ని వెలుగులోకి తెస్తే కులం పేరుతో ఎదురు దాడి చేస్తారా ? రాధాకృష్ణపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అవాకులు, చెవాకులు పేలితే ఉపేక్షించబోము, తాట తీస్తాం అంటూ ఒక హెచ్చరిక జారీ చేశారు, ఆంధ్రజ్యోతి కూడా తన వెబ్సైట్లో ప్రచురించింది,
అక్షరమే ఆయుధంగా వేమూరి రాధాకృష్ణ బొగ్గు గనుల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికితీస్తే దాని మీద కులం పేరుతో ఎదురు దాడి చేస్తారా కమ్మ మహాజన సంఘం ప్రశ్నించింది,బొగ్గు బ్లాక్ గనుల్లో అవినీతిని బయట పెడితే,అవినీతికి పాల్పడి మాది పలానా కులం,మాపై అగ్రవర్ణాలు దాడి చేస్తున్నాయనడం రాజ్యాంగ సమ్మతమేనా అంటూ కమ్మ మహాజన సంఘం మరో ప్రశ్నను సంధించింది…..
అదే విధంగా యూట్యూబ్ చానళ్లలో ప్రెస్మీట్లు పెట్టీ అడ్డగోలుగా విమర్శలు చేస్తున్న కొందరి వ్యవహారశైలిపై భట్టి విక్రమార్క విజ్ఞతతో స్పందించాలని కోరున్నాతున్నామని కమ్మ మహాజన సంఘం డిమాండ్ చేసింది, కానీ ఈ మొత్తం వ్యవహారంలో రాధాకృష్ణ బలహీనుడు కాదు,ఆయన ఇతరుల మీద తప్పుడు కథనాలు వేసినపుడు అటువైపు నుండి స్పందన రావడం సహజం, ఒకరో,ఇద్దరో మధ్యలో దూరి కుల ప్రస్తావన తెచ్చిఉంటే కమ్మ మహాజన సంఘం స్పందించడంలో తప్పు లేదు,కానీ ఎలా స్పందించాలి! మీడియా సంస్థల అధిపతిగా ఆయన ఏదో వ్రాసారు,రాజకీయ నాయకులుగా ఉన్నారు కాబట్టి మీరు మీరు చూసుకోండి,మధ్యలో కుల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు,కమ్మ కులాన్ని ఎందుకు లాగుతున్నారని
ప్రశ్నించి ఉంటే బాగుండేది కానీ రాధాకృష్ణ అక్షరమే ఆయుధంగా బ్రతుకుతున్నారు,ఆయన మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు,ఆయన జోలికి వస్తె మేము ఉపేక్షించబోము,తాట తీస్తాం అంటూ ఒక మీడియా అధినేతకు కుల సంఘం మద్దతుగా ప్రకటన ఇవ్వడం,దాన్ని ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో ప్రచురించడం చాలా గమ్మత్తైన విషయం,ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే రాధాకృష్ణ ఇతరుల మీద విమర్శలు చేస్తే కమ్మ మహాజన సంఘం స్పందించినపుడు, ఎటువంటి ఆధారాలు లేకుండా భట్టి విక్రమార్క టార్గెట్ గా నిందారోపణలు చేస్తూ వార్తా కథనాలు వండి వార్చినపుడు ఆయనకు సంబంధించిన సామాజిక వర్గాలకు కూడా బాధ అనిపిస్తుందిగా,మీరు స్పందించినట్లుగానే వారు కూడా స్పందించి వుంటారుగా అనే ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు….
కుల ప్రస్తావన అనేది ఒక బలహీనమై వ్యక్తి మీద చేసి ఉంటే కుల సంఘాలు మద్దతుగా నిలబడితే బాగుంటుంది కానీ రాధాకృష్ణ మెతక వైఖరి ఉన్న వ్యక్తి కాదు,అంత అమాయకుడు కాదు,అంత బలహీనుడు కాదు ఒక పెద్ద మీడియా సంస్థను ఏక చక్రాధిపత్యంగా నడుపుతున్నాడు,
ఆయనే అందరి మీద రకరకాలుగా దాడి చేస్తూ ఉంటాడు,ఆయన్ని అవతలి వాళ్ళు ఒక మాట అనగానే కుల సంఘం రంగంలోకి దిగి వార్నింగులు ఇవ్వడమనేది బాధాకరం,ఈ విధంగ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ కూడా మాకో కుల సంఘమ్మద్దతుగా రావడాన్ని ఆహ్వానిస్తున్నారా అంటే కమ్మ మహాజన సంఘం ప్రకటనను తన మీడియా వెబ్సైట్లో ప్రచురించడాన్ని బట్టి చూస్తే నిజమే అనిపిస్తుంది….
ఏది ఏమైనా ఎవరి కులం మనోభావాలు వారికి ఉంటాయి కానీ, ప్రజలు కులాల అడ్డు గోడలు తొలగించుకుని సమ సమాజం వైపు కదులుతున్న ప్రస్తుత తరుణంలో నా కులం,నా మతం అంటూ కొట్టుకు చావడం దురదృష్టకరం,ఇప్పటికైన కులాల ఈగోలను పక్కనబెట్టి మానవత్వమే మతంగా కలిసిమెలిసి జీవించే ప్రయత్నం చేయాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు…..
Pathi Sreenivas Rao:9703973456
