నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుంది : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…

Pathi Sreenivas Rao
2 Min Read

ఖమ్మం సిటీ :రాష్ట్రంలో అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి వంటి ప్రధాన హామీలను గాలికొదిలేసి యువతను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు.ప్రభుత్వ నిర్లక్ష్యంతో, ఉద్యోగాలు రావడంలేదన్న తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ‘వేణు’ అనే యువకుడిని పువ్వాడ అజయ్ కుమార్ స్థానిక ఆసుపత్రిలో పరామర్శించారు. స్వయంగా వైద్యులతో మాట్లాడి యువకుడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యువకుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. అధైర్యపడవద్దని, పార్టీ పరంగా అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు….

ఈ సందర్బంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ “నిరుద్యోగుల ఆశలను వమ్ము చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడుతోంది. హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యం వల్లే నేడు యువత ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారని పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు యువతకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుందని, తీరా అధికారంలోకి వచ్చాక వారిని రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత ఎవరూ ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, పోరాడి హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు…

నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, వారి భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పువ్వాడ స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడలు వంచైనా సరే, నిరుద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, బి.ఆర్. ఎస్ పార్టీ జిల్లా నాయకులు అర్జీసి కృష్ణ,బచ్చు విజయ్ కుమార్, పగడాల నాగరాజు,బత్తుల మురళి, బీరెడ్డి నాగచంద్రా రెడ్డి,మాటేటి కిరణ్, మగ్బుల్ దితరులు పాల్గొన్నారు…

📄 Generate e-Paper Clip
Share This Article