భూదాన్ భూముల్లో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చి వందలాది కుటుంబాలను నిరాశ్రయులను చేయడం దుర్మార్గం!!

Pathi Sreenivas Rao

ఈ రోజు సీపీఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కార్యాలయంలో భూదాన భూముల ఇళ్ల స్థలాల సమస్యపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగా రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ భూదాన్ భూములలో ఇళ్లు కోల్పోయిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం,పక్కా ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు,ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేసి వందలాది కుటుంబాలను నిరాశ్రయులను చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు,ఈ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు….

అదే విధంగా కొంత మంది వామపక్ష పార్టీల నాయకులు ఇళ్ల స్థలాల ఆశ జూపి నిరుపేదల సొమ్మును కోట్లలో దండుకున్నారన్న ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలనీ,బాదితుల డబ్బులు తిరిగి వారికి ఇప్పించాలని,దోషులను చట్టపరంగా శిక్షించాలని అన్నారు,ఒక్కో స్థలానికి 5 లక్షల వరకు వసూల్ చేశారని,మా పార్టీ కార్యకర్తలు కూడా డబ్బులు ఇచ్చి మోసపోయారని పేర్కొన్నారు,అక్కడ నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వం విద్యుత్ సౌకర్యం కల్పించకపోతే వాళ్ళ సొంత ఖర్చులతో జనరేటర్ కొనుగోలు చేసి దానిని ఉపయోగించి కరెంట్,నీళ్ళు తెచ్చుకున్నారని తెలిపారు,2019 లో బిఆర్ ఎస్ హయంలో కూడా మూడు సార్లు పేదల గుడిసెలను కూల్చే ప్రయత్నం చేశారని రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు పేదల పట్ల మొసలి కన్నీరు కారుస్తుందని ఎద్దేవా చేశారు,అదే విధంగా ఖాళీ చేయించి స్వాధీనం చేసుకున్న భూములను బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని,భూములు ప్రజలకు ,ప్రజా అవసరాలకు ఉపయోగించాలని ప్రభుత్వాన్ని కోరారు…..

అదే విధంగా తొలివెలుగు రఘు ఖమ్మం లో జరుగుతున్న భూదాన భూముల బాధితుల పక్షాన పోరాడటం కోసం రావడాన్ని ఆహ్వానిస్తున్నామని,కానీ కమ్యూనిష్టు పార్టీలో అమ్ముడుపోయాయి అనడం కరెక్ట్ కాదని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, తొలివెలుగు రఘు ఇక్కడి పరిస్థితులు తెలుసుకొని మాట్లాడాలని,నీ భాష సరిగలేదని అన్నారు, ఖమ్మం జిల్లాలో అన్ని కులాల మధ్య రాజకీయాలకు అతీతంగా సుహృద్భావ వాతావరణం నెలకొని ఉంటుందని అలాంటి వాతావరణాన్ని చెడగొట్టడం కోసం కులాల మధ్య కుంపట్లు పెట్టడం సరికాదు,అలా చేయడం వల్ల మీ చానల్ కు రేటింగ్ వస్తుందేమో చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా ప్రజలు అలాంటి తప్పుడు వార్తలు నమ్మరని ఇప్పటికీ నిన్ను మా మిత్రుడిగానే భావిస్తున్నామని,నీపై అనేక ఆరోపణలున్నా వాటిజోలికి మేం వెల్లదలుచుకోవడం లేదని,భాషా పద్ధతి మార్చుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు……