తెలంగాణా /హైదరాబాద్ :
మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.రేవంత్ రెడ్డికి, పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇద్దరికీ బుద్ధి లేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి బుద్ధి లేదని మండిపడ్డారు.ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిని, ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా బుద్ధి లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
పార్టీ మారుతున్న నాయకుల తీరుపై, అలాగే ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తున్న సొంత పార్టీ నాయకత్వ వైఖరిపై రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సొంత పార్టీ ముఖ్యమంత్రిపైనే ఆయన ఈ స్థాయి విమర్శలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో ఊహించని పరిణామంగా మారింది…
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట 9703973456
.