జనం ముచ్చట , ఖమ్మం జిల్లా:
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఆక్రమణలు తొలగింపులో బాగంగా గత పది సంవత్సరాలుగా స్థిర నివాసాలు ఏర్పరచుకుని జీవిస్తున్న పేదల గుడిసెలను రెవెన్యూ, పోలీసు అధికారులు ఖాళి చేయించిన ఘటన రాజకీయంగా అనేక మలుపులు తిరుగుతుంది,ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత BRS పార్టీ స్పందించిన తీరుపై నిన్న సాయంత్రం నుండి సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తుంది,
ఈ అంశంపై BRS పార్టీ తెగేదాకా లాగుతుందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వ్యక్తం అవుతుంది……
వివరాల్లోకి వెళితే వెలుగుమట్ల భూదాన్ భూముల ఘటన
తరువాత BRS పార్టీ నాయకులు కేటీఆర్ , హరీష్ రావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును,మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డినీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ టార్గెట్ చేసి ఘాటైన ఆరోపణలు చేశారు,ఈ విషయంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా స్పందించడంతో అసలు కథ అక్కడే మొదలయ్యింది, ఈరోజు ఉదయం ఒక పొలిటికల్ వాట్సాప్ గ్రూపులో ఒక కాంగ్రెస్ కార్యకర్త పాత వీడియోలను కోడ్ చేస్తూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఉద్దేశించి పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది….
పోస్టు సారాంశం
అయ్యా కేటీఆర్,పువ్వాడ అజయ్ కుమార్ గారు మీరు అధికారంలో మంత్రులుగా అధికార దర్పం వెలగబెడుతున్నపుడు ఇదే ఉన్నప్పుడే భూదాన్ భూముల్లో మీ ఆదేశాలతో ఆక్రమణలను తొలగించే ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా ? రోజు మీకు పేద ప్రజలు గుర్తుకు రాలేదా ? ఈ రోజు పేదల గుడిసెలు కూల్చారంటూ మొసలి కన్నీరు కార్చే మేకు ఆరోజు పేద ప్రజలు ఎందుకు గుర్తుకు రాలేదు? అంతెందుకు మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాగర్ కాలువపై పేద ప్రజలు వేసుకున్న గుడిసెలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి 58,59 జీవోల కింద రెగ్యులరైజ్ చేసుకున్న మాట వాస్తవం కాదా? మీ కర్కశ బూట్ల క్రింద నలిగిపోయింది నిరుపేదలు కాదా ? మరి ఈరోజేందుకు పేదల గుడిసెలు కూల్చారంటూ గుండెలు బాదుకుంటున్నావు,సిగ్గు లేకపోతే సరి,మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారమా? మరి ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం ఎందుకు ? నిజo,నిజాయితీ అనేవి మనం ఉన్న పరిస్థితుల్ని బట్టి మారవు, అధికారంలో ఉన్నప్పుడు ఒక లాగా ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించడం నీకే చెల్లింది,మీ ఊసరవెల్లి రాజకీయాలు ఖమ్మం ప్రజలు తో పాటు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారనేది మీరు మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అదే ప్రజలు ఛీత్కారాలు మీకు తప్పవు…..
మంత్రి తుమ్మలపై దుష్ప్రచారం చేస్తే సహించం: కాంగ్రెస్ కార్యకర్తల హెచ్చరిక…..
ఈ విషయం మీద సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు BRS పార్టీపై దుమ్మెతి పోస్తున్నారు, పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా ఉన్నపుడు ఆక్రమణలు తొలగించడానికి ప్రయత్నించి చేతకాక వదిలేస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమణలు తొలగిస్తే శవాల మీద పేలాలు ఎరుకున్నట్లు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,ఖమ్మం పట్టణానికి కిలో మీటర్ల దూరంలో ఎక్కడా కూడా తుమ్మల నాగేశ్వరరావుకు ఒక్క గజం స్థలం కూడా లేదని, భూదాన్ భూముల చుట్టు పక్కల ఉన్నవన్నీ BRS పార్టీ నాయకుల భూములే అని పేర్లతో సహా బయటపెట్టడం విశేషం,ఈ ఘటన మీద పూర్తి స్థాయి విచారణ జరిగితే మీ నాయకుల బ్రతుకులు బయటపడతాయనే అభద్రతా భావంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బధనాం చేయడానికి BRS పార్టీ గోటితో పోయే దాన్ని గోరంతలు కొండంతలు చేస్తూ మంత్రి తుమ్మలపై దుష్ప్రచారానికి పూనుకుందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండి పడుతున్నారు,ఈ మొత్తం వ్యవహారంలో పార్టీ తీసుకున్న నిర్ణయంపై కొందరు BRS నాయకులు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది….
కేటీఆర్ ఏ మొహం పెట్టుకుని ఖమ్మం వస్తున్నాడు ?
రేపు బాదితుల పరామర్శ పేరుతో ఖమ్మం వస్తున్న కేటీఆర్ నాడు అధికారంలో ఉన్నపుడు హైదరాబాద్ లో ఎన్నో పేదలు గుడిసెలు కూల్చి ఎంతో మంది నిరుపేదల బ్రతుకులు బజారు పాలు చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసని, కేటీఆర్ రేపు ఏ మొహం పెట్టుకుని బాదితుల పరామర్శ పేరుతో ఖమ్మం వస్తున్నాడనీ,హైదరాబాద్ లో నిరాశ్రయులైన పేద ప్రజలను ఏ విధంగా ఆదుకున్నాడనే విషయం మీద క్లారిటీ ఇచ్చిన తరువాతే ఖమ్మంలో అడుగుపెట్టాలని లేకుంటే ఖచ్చితంగా కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు, కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న హెచ్చరికలతో రేపటి కేటీఆర్ పర్యటన ఏ మాత్రం సజావుగా సాగుతుందనే విషయంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు, ప్రస్తుతం ఖమ్మం నగరం ఇరు పార్టీల సవాళ్లు ప్రతి సవాళ్లతో మధ్య అట్టుడికి పోతుంది,ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి,ఇలాంటి ఉద్రిక్తతల మధ్య కేటీఆర్ పర్యటన సాపీగా సాగుతుందా ? ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారనేది వేచి చూడాలి…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట,హైదరాబాద్ :9703973456