జనం ముచ్చట,ఖమ్మం జిల్లా:
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఖమ్మంలో పర్యటించారు,రెండు రోజుల క్రితం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తొలగించిన గుడిసెల ప్రదేశాన్ని సందర్శించి,బాధితులతో మాట్లాడారు,పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా,కనీస కనికరం లేకుండా ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు,ఈ క్రమంలో బాదితుల అవేదన సావధానంగా విన్న కేటీఆర్ పేద ప్రజల కన్నీటి పాపం ఊరికే పోదని,పేదల ఉసురు తగిలి త్వరలోనే దోపిడి ప్రభుత్వం కూలిపోక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు,BRS ప్రభుత్వం వచ్చిన తరువాత ఎక్కడైతే పేదల ఇండ్లను కూల్చారు అక్కడే వారికి ఇండ్లు కట్టించి గృహ ప్రవేశాలు చేయిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు…..

మంత్రులు ఏ తప్పు చేయకపోతే ఆర్డీవోని ఎందుకు బదిలీ చేశారు ?
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏతప్పు చెయ్యకపోతే ఖమ్మం ముగ్గురు మంత్రులు వెలుగుమట్లకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు, కూల్చివేతల విషయంలో ఏ తప్పు జరగక పోతే ఆర్డీవోని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారంటూ నిలదీశారు,మంత్రులు తప్పు చేసి అధికారులను బలి పశువులను చేసి కాంగ్రెస్ సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు,ఇద్దరు పెద్ద మనస్సులు పెద్ద మనస్సుతో 1950 సంవత్రంలో లక్షల ఎకరాల భూమిని దానం చేశారని,దానిలో భాగంగానే వెలుగుమట్ల లో 63 ఎకరాల భూమిని దానం చేశారని కానీ 1989 లో కొందరు నకిలీ పట్టాలు సృష్టించి 30 ఎకరాల భూమిని కబ్జా చేశారని,గతంలో మిగిలిన 32 ఎకరాల భూమిలో 1895 మందికి 100 గజాల చొప్పున 2014 లో ఒరిజినల్ పట్టాలు ఇచ్చారని వాటిని ఇపుడు ఫోర్జరీ డాక్యుమెంట్లు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పట్టాల విషయంలో స్వయంగా భూదాన్ చైర్మెన్ ప్రస్తుతం ఉన్న పట్టాలు ఒరిజినల్ పట్టాలు అంటున్నాడని కానీ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఇవేమీ తెలియనట్లు కమల్ హాసన్ కంటే గొప్పగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు…..

చేసిన తప్పుకు మంత్రులు క్షమాపణ చెప్పాలి….
పేదల ఇండ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా ?
పక్కన విలాసవంతమైన విల్లాలలో మీ కాంగ్రెస్ నేతల అనుచరులు నివసిస్తుంటే శత్రు దేశం మీదకు దండయాత్రకు పోయినట్లు నాలుగు జిల్లాల పోలీసులను పేదల గుడిసెలపై ఉసిగొల్పి వందలాది కుటుంబాలను నిరాశ్రయులను చేశారని,ముఖ్యంగా అక్కడ నివసిస్తున్నది ఎక్కువగా ఎస్సీ,ఎస్టీ,బీసీలని,గుడిసెల పక్కనున్న ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులకోసం జిల్లా మంత్రులు ఇంత దారుణానికి ఒడిగట్టారని,ఇది దయ లేని ప్రభుత్వమని ప్రజల మాన ప్రాణాలాంటే లెక్కలేదని వ్యాఖ్యానించారు,ఇందిరమ్మ రాజ్యం అంటే విధ్వంసమేనా ఇకనైనా జిల్లా మంత్రులు చేసిన తప్పుకు ప్రజల ముందు చెంపలు వేసుకుని,చేసిన తప్పును ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎక్కడైతే పేదల గుడిసెలు కూల్చారో అక్కడే పక్క ఇల్లు మంజూరి చేసి ,మానవత్వాన్ని చాటుకోవాలని అన్నారు,ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదని బాధితులు అంటున్నారని,కొంతమంది అధికారులు విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారని ఇది పద్ధతి కాదని,పేద ప్రజలపై ప్రభుత్వం కత్తి గట్టి,పగబట్టి వ్యవహరిస్తుందని,బాధితులకు చివరి వరకు అండగా ఉంటామని,ఈ పోరాటంలో కలిసి వచ్చే వారితో కలిసి పోరాడతామని,ఈ పోరాటంలో మాకు రాజకీయ ప్రయోజనం ఏమీలేదని అన్నారు…

వెలుగుమట్ల బాధితుల కోసం ఎందాకైనా వెళ్తాం….
రెండున్నరేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పేదల ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టింది,వెలుగుమట్ల ఘట్నలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇండ్లు కట్టించే బాధ్యత BRS పార్టీ తీసుకుంటుందని అన్నారు,ఈ ఘటన మీద త్వరలో జాయింట్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని,మీరు ఐకమత్యంగా, ధైర్యంగా ఉండండి మీకు న్యాయం జరిగేదాకా మేము కొట్లాడుతాం,అవసరమైతే సుప్రీంకోర్టు దాకైనా వెళ్దామని వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యం చెప్పారు…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్,హైదరాబాద్:9703973456