మంత్రి పొంగులేటి లక్ష్యంగా ‘గులాబీ’ మీడియా అసత్య ప్రచారం.. దీటుగా తిప్పికొడుతున్న కాంగ్రెస్ శ్రేణులు!!

Pathi Sreenivas Rao

ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎదురుదాడికి దిగాయి.కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వ పాలనలో తప్పులు దొరకకపోవడంతో, బీఆర్ఎస్ నేతలు సుద్దపూసల్లా నటిస్తూ భూతద్దం పెట్టి మరీ తప్పులు వెతికే ప్రయత్నం చేస్తున్నారుని,ప్రజల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కడుపుమంటతో బీఆర్ఎస్ ఇలాంటి తప్పుడు ప్రచారాలకు దిగుతోందని,గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలను, అవినీతిని మంత్రి పొంగులేటి నిర్భయంగా ఎండగడుతున్నారు. దాన్ని తట్టుకోలేకనే ఆయనపై ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు….

ఈ వివాదం నేపథ్యంలో మంత్రి పొంగులేటి అభిమానులు బీఆర్ఎస్ పార్టీకి గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఒకసారి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ ఏకంగా అధికారానికే దూరమైందని వారు గుర్తు చేస్తున్నారు. తగిన శాస్తి జరిగినప్పటికీ ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని, మళ్లీ అదే తప్పు చేస్తూ ఉనికిని కోల్పోయే స్థాయికి దిగజారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజకీయాల్లో చిన్న విషయాలను సైతం వక్రీకరించి పబ్బం గడుపుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ‘పేపర్లు విసిరిన’ వివాదాన్ని సృష్టించారని కాంగ్రెస్ శ్రేణులు బలంగా వాదిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు వెళ్తున్న మంత్రుల మధ్య చిచ్చుపెట్టే ఈ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వారు స్పష్టం చేస్తున్నారు….