ABN రాధాకృష్ణకు భట్టి వార్నింగ్,తప్పుడు కథనాలు వ్రాస్తే చూస్తూ ఊరుకోను!!

Pathi Sreenivas Rao

ఈ రోజు ప్రజా భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎబిఎన్ రాధాకృష్ణను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు,నేను పత్రికాధిపతిని,నా చేతిలో మీడియా ఉంది,అడ్డగోలుగా ఏది వ్రాసినా చెల్లుతుంది,నేను వ్రాస్తానంటే కుదరదు,నేను ఆస్తులు సంపాదించుకోవడానికో లేక వ్యవస్థల మీద పెత్తనం చేయడానికో,అక్రమ సామ్రాజ్యాలు నిర్మించుకోవడాని రాజకీయాల్లోకి రాలేదు,నేను ఈ సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను,ఆ మార్పు చట్ట సభల ద్వారా సాధ్యం అవుతుంది కాబట్టే చట్ట సభలోకి వచ్చాను,సింగరేణి కార్మికులు రక్తంతో చెమటతో తడిసిన బొగ్గు బావుల మీద ఏ రాబందులను వాలనివ్వను,ఏ గద్దలను ఏ పెద్దలను వాలనివ్వను, తెలంగాణ ఆస్తులను కాపాడుకుంటాను,
అదే నా ముందున్న ఏకైక లక్ష్యం, నలబై ఏండ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో కష్టనష్టాలకు,వ్యయప్రయాసలకోర్చుని కోర్చి,ఎన్నో కుల రాజకీయాలను తట్టుకుని ఇక్కడిదాకా వచ్చాను, నలబై ఏండ్లుగా నేను పోగేసుక్కున్న వ్యక్తిత్వాన్ని ఒక్క రోజులో,ఒక్క కలం పోటుతో మంటగలుపుతానంటే నేను చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేను,నాపై వ్రాసిన కథనాలన్ని తప్పుడు కథనాలనీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ప్రచురించాలని డిమాండ్ చేస్తున్న,అలా జరగనప్పుడు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా వ్యవహరించినందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎబిఎన్ రాధాకృష్ణను హెచ్చరించారు….

అసలు విషయానికొస్తే గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్టానికి సంబంధించి ఆత్మగా పిలువబడే సింగరేణిపై కొన్ని కట్టు కథలు,కొన్ని రాతలు,కొన్ని లేఖలు అంతిమంగా సింగరేణిలో పని చేస్తున్న 42 వేలమంది పర్మినెంట్ ఉద్యోగస్తులు మరో,30 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా రకరకాల అపవాదులను ప్రచారం చేస్తున్నారు,దీంట్లో ప్రధానంగా పెట్టుబడులు,కట్టుకథల విషపు రాతల ఏబీఎన్ రాధాకృష్ణతో తన “తొలిపలుకు” అనే కథనంలో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం,నిందలు మోపడం, ఊహాగానాలతో రోజుకో కథనాన్నీ వండి వార్చడం జరుగుతుంది,ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సింగరేణి ఆస్తులను కాపాడాల్సిన వ్యక్తిగా వీటన్నింటిని చూస్తా ఉంటే ఏ రాబందులు,ఏ గద్దలు,ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో
ఏబీఎన్ రాధాకృష్ణ ఈ కథనాలు వ్రాస్తున్నట్లుగా అనిపిస్తుంది ,
ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అనే లెనిన్ చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ ఏబీఎన్ రాధాకృష్ణ తొలిపలుకుల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయోనంటూ నాకు తెలియదని,ఇటువంటి రాతలు,తప్పుడు కథనాలతో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిపై నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి, సింగరేణి కి నష్టం చేస్తున్నారనే సంగతి మర్చిపోతున్నారనీ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు,….

సింగరేణికి సంబంధించి ఏబీఎన్ రాధాకృష్ణ వ్రాసిన కథనంలో రెండు అంశాలను లేవనెత్తారు,భట్టి విక్రమార్క అస్మధీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టే ఉద్దేశంతో “సైట్ విజిట్” అనే కండీషన్ పెట్టి దాని ద్వారా తమవాళ్ళకు కాంట్రాక్టులు దారాదత్తం చేయాలనే దురుద్దేశంతో కూడిన ఆలోచనలు ఉన్నాయని ఊహాజనిత కథనాలు వ్రాసారు,ఆయన కథనం వ్రాయడమే ఆలస్యం ఒకాయన లేఖ వ్రాసారు,ఇంకోకాయన డిల్లీ నుంచి దదిగొచ్చాడంటూ హరీష్ రావు, కిషన్ రెడ్డిలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు,అసలు ఈ ముగ్గురు మధ్య ఉన్న సంబంధం ఏమిటనీ భట్టి విక్రమార్క ప్రశ్నించారు…..

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేశంలో ఎక్కడ లేని విధంగా సైట్ విజిట్ అనే కండీషన్ పెట్టీ సింగరేణి కాంట్రాక్టులు తమ వారికి దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నడంటూ ఇష్టం వచ్చినట్లు రాధాకృష్ణ వ్రాశాడు, వాస్తవానికి టెండర్లు కానీ వాటికి సంబంధించిన రోజువారీ వ్యవహారాలు కానీ ప్రభుత్వం దృష్టికి రావు,ఏ ఒక్క నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లు సంబంధిత మంత్రి దృష్టికి రావు,సింగరేణి అనేది నూట ఐదు సంవత్సరాల నుండి నడుస్తున్న స్వతంత్ర సంస్థ,దీనికి సంబంధించి మంత్రి మండలికి కూడా సంబంధం లేదు,ఈ విషయ పరిజ్ఞానం ఉండి ఉంటే,ఇంగిత జ్ఞానం లేకుండా ఏబీఎన్ రాధాకృష్ణ ఇలాంటి చెత్త వ్రాతలు వ్రాసేవాడు కాదు…,

సింగరేణి యాజమాన్యం బొగ్గు టెండర్లు విషయం వారి ప్రొసీజర్ ప్రకారం వారు చేసినప్పటికీ ఇది నాలుగు కోట్లమంది ప్రజలకు సంబంధించిన ఆస్తి ఇది కాబట్టి టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలనీ టెండర్లు రద్దు చేయమని అదేశాలు జారీ చేశాను,ఆ తరువాత ఈ తప్పుడు వార్తల వెనుకున్న నిజానిజాలు తిరిగి మీడియా సమావేశంలో చెబుతానని చెప్పాను, వారం రోజుల వ్యవధిలో నేను వ్రాసింది తప్పుడు వార్త అని ఏమైనా పునరాలోచన చేస్తారేమోనని అనుకున్న,అదే విధంగా ఈ కథనం మీద కేంద్రానికి లేఖ వ్రాసిన హరీష్ రావుకు,స్పందించిన కిషన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియచేస్తున్న , కిషన్ రెడ్డి ఈ విషయం మీద విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్న, మొత్తం వ్యవహారాల మీద విచారణ జరిపించాలి,ఎవరి ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో రాష్ట్ర,దేశ ప్రజలకు తెలియాలన్నారు,కేవలం కొద్దిమంది వ్యక్తుల స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తులను అప్పగించడం కోసం ప్రభుత్వంపై,వ్యక్తులపై అడ్డగోలుగా వార్తలు వార్తలు వ్రాసి బ్రతికేవాళ్ల నిజ స్వరూపాలు బయటకు రావాలని ఏబీఎన్ రాధాకృష్ణను ఉద్దేశించి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు…..

సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇనిస్టీట్యూట్ కోల్ ఇండియా లిమిటెడ్ (CMPDI) సింగరేణికి సంబంధించి టెండర్ పిలవడానికి టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పంపించమని కోల్ ఇండియా సంస్థను 2018 ఆదేశించింది,దీంట్లో బిడ్డర్లు “సైట్ విజిట్” తప్పనిసరి, దానికి సంబంధించి సైట్ ఇంచార్జీ ఆఫీసర్ “సైట్ విజిట్ సర్టిఫికెట్” జారీ చేయాలని స్పష్టం చేశారు,అదే విధంగా 2021 లో కోల్ ఇండియా ప్రతిష్టాత్మక “మినీ రత్న” కంపెనీ కూడా ఇదే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి సింగరేణికి పంపించారు,ఇదే పద్ధతిని 2022,2023 లో కూడా సింగరేణి సంస్థ అవలంబించింది,ఇపుడు చెప్పండి ఈ కండీషన్ ఎవరు పెట్టారు 2018,2021,2022,2023 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు,భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా లేడు,ఈ విషయంలో భట్టి విక్రమార్కకు దురుద్దేశాలు స్పందించాలని ఏబీఎన్ రాధాకృష్ణ తప్పుడు కథనాలు వండి వార్చాడని తీవ్రంగా దుయ్యబట్టారు,ఏబీఎన్ రాధాకృష్ణ ఎవరి కండ్లాల్లో ఆనందం చూడడానీకో తప్పుడు కథనాలు వ్రాయడం దుర్మార్గమని,ఇప్పటికైనా ఏబీఎన్ రాధాకృష్ణ వాస్తవాలను గ్రహించి నా మీద వ్రాసిన తప్పుడు కథనాలను వెనక్కు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు…..