బాధిత కుటుంబానికి అండగా ఉంటా….రోడ్డు ప్రమాదంలో గాయపడిన సురేష్‌ను పరామర్శించిన బానోత్ మనీష లక్ష్మి….

Pathi Sreenivas Rao

వైరా, (రిపోర్టర్ సత్తేనపల్లి శివ ):ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు రాజశేఖర్ నగర్‌కు చెందిన పసుపులేటి సురేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనిషా లక్ష్మి, మదన్‌లాల్ తదితరులు సురేష్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు….

ఈ సందర్భంగా బాధితుడి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. ఈ కష్టకాలంలో మనోధైర్యం కోల్పోవద్దని, సురేష్ త్వరగా కోలుకుంటారని వారికి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వైద్యపరంగా గానీ, మరే ఇతర సాయం కావాలన్నా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు భరోసా ఇచ్చారు…..

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులతో పాటు 8వ వార్డు కౌన్సిలర్ చిన్న కోటయ్య, పార్టీ ముఖ్య నాయకులు దేవరాజు, పాముల వెంకటేశ్వర్లు, విలసాగరం నరేష్, కర్నాటి భద్రయ్య మరియు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..