తెలంగాణ /హైదరాబాద్ :
హైదరాబాద్: దేశంలో ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంల పనితీరుపై నానాటికీ అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లో వేలాది ఈవీఎంలు అగ్ని ఆహుతి కావడం, ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి జరిగిన పోలింగ్ సరళి తదితర పరిణామాలు ఎన్నికల వ్యవస్థపై తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా సమీపంలోని (దక్షిణ 24 పరగణాల జిల్లా పరిషత్ కార్యాలయం ఉన్న) తొమ్మిది అంతస్తుల ప్రభుత్వ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన సుమారు 4,000 ఈవీఎంలు పూర్తిగా దగ్ధమయ్యాయి అయితే, ఈ అగ్నిప్రమాదం జరిగిన తీరు కుట్ర కోణాలకు తావిస్తోంది. భవనంలోని మూడో అంతస్తులో మొదలైన మంటలు.. మధ్యలో ఉన్న 4, 5, 6 అంతస్తులను వదిలేసి నేరుగా 7, 8, 9 అంతస్తులకు వ్యాపించి ఈవీఎంలను బూడిద చేయడం విస్మయపరుస్తోంది భవనంలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడం, కనీసం గాయాలు కూడా కాకపోవడం ఈ అనుమానాలను మరింత పెంచుతోంది…..
గల్లంతైన 90 లక్షల ఓట్లు…మమతా బెనర్జీ ఆవేదన….ఏపీ ఎన్నికల్లోనూ వీడని మిస్టరీ….
పశ్చిమ బెంగాల్లో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య ఈవీఎంల వివాదం తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రంలో ఏకంగా 90 లక్షలకు పైగా ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కేవలం 30 లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అక్కడ అధికారంలోకి రావడం, స్వయంగా మమతా బెనర్జీ నియోజకవర్గంలోనే లక్ష ఓట్లు గల్లంతు కావడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.
ఈవీఎంలు, ఎన్నికల తీరుపై కేవలం బెంగాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కూడా విపక్షాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో పోలింగ్ రోజు అర్ధరాత్రి 2 గంటల వరకు సుమారు 52 లక్షల మంది ఎలా ఓట్లు వేశారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది కేవలం మూడు సెకన్లకు ఒకరు చొప్పున ఓటు వేయడం ప్రాక్టికల్‌గా సాధ్యమా? అంటూ ప్రజలు, నెటిజన్లు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు…..
విచారణల పేరుతో ప్రహసనం….
ఈవీఎంల భద్రత, అగ్నిప్రమాదాల వెనుక ఏవో అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం ఎన్నికల వ్యవస్థ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కథనం పేర్కొంది,పోలీసు వ్యవస్థ, న్యాయవాదులు, మొత్తం ‘సిస్టం’ అంతా ఒకరి గుప్పిట్లోనే ఉన్నప్పుడు విచారణలు నిష్పాక్షికంగా ఎలా జరుగుతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు.మొత్తంగా, ఈవీఎంల దహనం, లక్షలాది ఓట్ల తొలగింపు, అర్ధరాత్రి పోలింగ్ వంటి వరుస పరిణామాలు భారత ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై వివాదాలు, ఎన్నికల కమిషన్ తీరుపై వస్తున్న విమర్శల నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని లోతైన విచారణ జరిపితే తప్ప ప్రజాస్వామ్యంపై నమ్మకం నిలబడేలా కనిపించడం లేదు…..
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట న్యూస్,హైదరాబాద్ :9703973456