పాలేరు జన హృదయ నేతగా ‘పొంగులేటి’.. ‘ప్రజా దర్బార్‌’తో పెరిగిన రాజకీయ మైలేజీ!!

Pathi Sreenivas Rao

పాలేరు : రాష్ట్రంలో మరే నియోజకవర్గంలో లేని విధంగా, పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా దర్బార్” కార్యక్రమం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్తూ ఆయన అందిస్తున్న భరోసా నియోజకవర్గ వ్యాప్తంగా సంచలనంగా మారింది,నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు చివరిగా నిన్న ఏదులాపురం మున్సిపాలిటీలో నిర్వహించిన “ప్రజా దర్బార్” పూర్తి స్థాయిలో సక్సెస్ అవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకుంది…

ప్రభుత్వ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు, ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించడమే ఈ “ప్రజా దర్బార్” ముఖ్య ఉద్దేశం. రోజుల తరబడి, నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా కొలిక్కిరాని ఎన్నో రెవెన్యూ, భూమి, పెన్షన్, మరియు ఇతర మౌలిక వసతుల సమస్యలు ఈ దర్బార్ వేదికగా నిమిషాల వ్యవధిలో పరిష్కారమవుతున్నాయి.మంత్రి స్వయంగా జిల్లా కలెక్టర్ తో పాటు అన్ని డిపార్ట్మెట్ల అధికారులను పక్కన పెట్టుకుని ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే బాధ్యత వారికి అప్పగిస్తుండడంతో చాలా వరకు సమస్యలు అక్కడిక్కడే పరిష్కారం అవుతుండడంతో పాలేరు ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి…

రాష్ట్ర మంత్రిగా అత్యంత కీలకమైన శాఖల బాధ్యతలు నిర్వహించడం, రాష్ట్రవ్యాప్త పర్యటనల ఒత్తిడి కారణంగా పొంగులేటి నియోజకవర్గానికి కొంత సమయం కేటాయించలేకపోతున్నారనే నెగిటివ్ భావన గతంలో ప్రజల్లో కొంత వ్యక్తమైంది. అయితే, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆయన ఈ ‘ప్రజా దర్బార్’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాననే నమ్మకాన్ని కలిగించడంలో మంత్రి పొంగులేటి సక్సెస్ అయ్యారు, నియోజకవర్గం ప్రజలు,జిల్లా, మండల అధికారుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం వంద శాతం విజయవంతమైంది.దీంతో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా దూసుకుపోయింది….

“పాలేరు ప్రజలు కేవలం అభివృద్ధిని మాత్రమే కాదు.. ఆత్మగౌరవాన్ని కూడా కోరుకుంటారు.”ఈ విషయాన్ని బాగా వంటబట్టించుకున్న మంత్రి పొంగులేటి, నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో పూర్తి విజయం సాధించారు. రాజకీయాలు, పార్టీల రంగులు చూడకుండా, అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తుండడంతో విపక్షాల సానుభూతిపరులు సైతం పొంగులేటికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ అపూర్వ స్పందన ఆయనకు రాజకీయంగా భారీ మైలేజీని, ప్రజాదరణను తెచ్చిపెట్టిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు….

సాధారణ ప్రజలతో పాటు పార్టీ నాయకులు, కిందిస్థాయి కార్యకర్తల పట్ల పొంగులేటి చూపే ఆత్మీయత, వారి సమస్యల పరిష్కారంలో ఆయన తీసుకునే ప్రత్యేక చొరవ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేవలం నాయకుడిగానే కాకుండా, తమ కష్టసుఖాల్లో పాలుపంచుకునే కుటుంబ పెద్దగా నిలవడంతో కార్యకర్తల గుండెల్లో ఆయన ‘రియల్ హీరో’గా నిలిచారు.పాలేరు నియోజకవర్గ రాజకీయాల్లోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఈ ‘ప్రజా దర్బార్’ మోడల్ ఇప్పుడు ఒక ఆదర్శవంతమైన పాలనా వేదికగా చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం కలగలిసిన పొంగులేటి మార్కు రాజకీయం పాలేరులో సరికొత్త చరిత్ర లిఖిస్తోంది…..