తెలంగాణ/ఖమ్మం జిల్లా:
ఖమ్మం, మే 30:ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి, ఇక ఆ అవయవాలను తొలగించాల్సిందే అని ఆశలు వదులుకున్న ఎంతోమంది రోగులకు ఖమ్మంలోని టిఆర్ఆర్ (TRR) ఆర్థో యాక్సిడెంట్ కేర్ హాస్పిటల్ సరికొత్త జీవితాన్ని ప్రసాదిస్తోంది. క్లిష్టమైన ఎముక గాయాలు, ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలకు అత్యాధునిక ‘ఇలిజారోవ్ (Ilizarov)’ పద్ధతి ద్వారా అవయవ రక్షణ చికిత్సలు అందిస్తూ వైద్య బృందం అద్భుత ఫలితాలను సాధిస్తోంది.గత ఏడాదిన్నర కాలంలో ఎన్నో అరుదైన, క్లిష్టమైన ఆర్థోపెడిక్ కేసులను విజయవంతంగా ఛేదించినట్లు ప్రముఖ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ తోట లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శనివారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు…..

ఇలిజారోవ్ టెక్నిక్‌తో అద్భుతాలు….
తీవ్రమైన క్రష్ ఇంజరీల (Crush Injuries) బారిన పడి ఎముకలు, మృదు కణజాలం (Soft Tissue) పూర్తిగా దెబ్బతిన్న పలువురు రోగులకు ‘ఇలిజారోవ్’ పద్ధతి వరంగా మారుతోంది. ఈ అత్యాధునిక విధానం ద్వారా ఎముకల పొడవును పెంచడం (Bone Lengthening), విరిగిపోయిన లేదా దెబ్బతిన్న ఎముకలను పునర్నిర్మించడం (Bone Reconstruction) వంటి సంక్లిష్ట ప్రక్రియలను వైద్యులు అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
రోగులకు పునర్జన్మ.. ప్రధాన విజయగాథలు ఇవే….
హాస్పిటల్ సాధించిన ప్రధాన విజయాలను డాక్టర్ లక్ష్మణ్ కుమార్ మీడియాకు వివరించారు. వాటిలో తీవ్రమైన ప్రమాదానికి గురైన ఈ మహిళకు ఇలిజారోవ్ పద్ధతి ద్వారా ఏకంగా 12.2 సెంటీమీటర్ల మేర ఎముక పెంపు చేసి, కాలును విజయవంతంగా కాపాడారు,అంతే కాకుండా సురేష్ అనే పేషెంట్ కాలు ఎముక అతుక్కోకపోవడం, తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్న ఇతనికి 6 సెంటీమీటర్ల లింబ్ లెంగ్తెనింగ్ (Limb Lengthening) చేశారు.ఇలిజారోవ్ విధానంతో సురేష్‌కు 8 సెంటీమీటర్ల మేర ఎముక పెంపును విజయవంతంగా పూర్తి చేశారు. అదే విధంగా తీవ్రమైన వాల్గస్ డిఫార్మిటీ (Valgus Deformity), ఆస్టియోఆర్థ్రైటిస్‌తో నడవలేని స్థితిలో ఉన్న ప్రమీలకు ‘టోటల్ నీ రీప్లేస్‌మెంట్’ (Total Knee Replacement – మోకాలి కీలు మార్పిడి) శస్త్రచికిత్స చేసి సాధారణ జీవితాన్ని అందించారు…..
13 నెలల పోరాటం.. డ్రైవర్ సోమేశ్వరరావుకు కొత్త అడుగులు….
వైద్య బృందం ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన కేసు లారీ డ్రైవర్ సోమేశ్వరరావుది. రెండు కాళ్లకు తీవ్రమైన క్రష్ ఇంజరీలు కావడం, కణజాలం భారీగా దెబ్బతినడంతో కాలు తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కానీ, వైద్యులు ఆశలు వదులుకోలేదు.”ఇలిజారోవ్ పద్ధతి, స్కిన్ గ్రాఫ్టింగ్ మరియు దీర్ఘకాలిక పునరావాస (Rehabilitation) చికిత్సల కలయికతో సోమేశ్వరరావుకు ఏకంగా 13 సెంటీమీటర్ల ఎముక పునర్నిర్మాణం చేశాం. సుమారు 13 నెలల సుదీర్ఘ చికిత్స అనంతరం ఆయన తన కాళ్లపై తాను నిలబడి, తిరిగి నడిచే స్థితికి చేరుకున్నారు,” అని డాక్టర్ లక్ష్మణ్ కుమార్ సగర్వంగా తెలిపారు…..
సమిష్టి కృషితోనే ఈ విజయాలు….
కేవలం ఇలిజారోవ్ చికిత్సలే కాకుండా, రోడ్డు ప్రమాదాలు మరియు దాడుల వల్ల బహుళ ఫ్రాక్చర్లతో (Multiple fractures), తలకు బలమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో వచ్చిన ఎంతోమందికి దశలవారీ శస్త్రచికిత్సలు నిర్వహించి పూర్తిగా కోలుకునేలా చేశామని డాక్టర్ వివరించారు.ఈ అద్భుత విజయాల వెనుక నిరంతరం శ్రమించిన తోటి వైద్యులు, అనస్థీషియా నిపుణులు, నర్సింగ్ సిబ్బంది, ఫిజియోథెరపిస్టులు, మరియు ఇతర సహాయక సిబ్బంది సమిష్టి కృషి ఎంతో ఉందని డాక్టర్ లక్ష్మణ్ కుమార్ కొనియాడారు. భవిష్యత్తులోనూ అత్యాధునిక వైద్య సాంకేతికతను సామాన్యులకు చేరువ చేస్తూ, అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు టిఆర్ఆర్ హాస్పిటల్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు…..
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456