అభివృద్ధి అస్త్రం.. ప్రజా సంక్షేమమే లక్ష్యం: పాలేరు గడ్డపై పొంగులేటి మార్క్ పాలన!!

Pathi Sreenivas Rao

పాలేరు నియోజకవర్గం :రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాలనా పగ్గాలు చెలాయిస్తూనే, తన సొంత నియోజకవర్గం ‘పాలేరు’ను అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నారు,ప్రభుత్వ సంక్షేమ ఫలాలను గడపగడపకూ చేరవేస్తూ, మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనలో రికార్డు స్థాయి నిధులు వెచ్చిస్తూ ఆయన దూసుకుపోతున్నారు,తాను ఎంత బిజీగా ఉన్నా పాలేరు నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజల కష్టసుఖాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏమాత్రం విస్మరించడం లేదు.తన సహజ సిద్ధమైన కలుపుగోలుతనంతో, “ప్రజాదర్బార్” వేదికగా సామాన్యులకు చేరువవుతూ పాలనలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు…

పాలేరు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంత్రి పొంగులేటి దూకుడు ప్రదర్శిస్తున్నారు.దానిలో భాగంగానే నిన్న ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 75 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించి, పట్టణీకరణలో వేగం పెంచారు.నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ రూపురేఖలు మార్చేందుకు పట్టణ ప్రగతిలో బాగంగా డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ, తాగునీటి సరఫరా మెరుగుదల మరియు వీధి దీపాల ఏర్పాటు వంటి పనులతో త్వరలో ఏదులాపురం మున్సిపాలిటీ రూపురేఖలు మారనున్నాయి,పాలేరు నియోజకవర్గాన్ని కేవలం ఒక నియోజకవర్గంగానే కాకుండా, రాష్ట్రంలోనే ఒక ‘మోడల్ హబ్’గా మార్చాలన్నది మంత్రి సంకల్పం. విద్యా, వైద్య రంగాల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలను ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు…..

గ్రామీణ అనుసంధానం: నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ప్రధాన రహదారులతో కలిపేలా లింక్ రోడ్లు, అంతర్గత రవాణా కోసం సీసీ రోడ్ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టారు. పల్లె-పట్టణం అనే తేడా లేకుండా సమాన అభివృద్ధికి ఆయన పెద్దపీట వేస్తున్నారు.నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో సైతం రవాణా సౌకర్యాలు మెరుగుపరచడానికి మంత్రి పొంగులేటి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను పాలేరు నియోజకవర్గంలో పకడ్బందీగా అమలు చేయడంలో పొంగులేటి సఫలీకృతమవుతున్నారు….

మహాలక్ష్మి & గృహజ్యోతి పథకాల ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలు నియోజకవర్గంలో వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నాయి అంతే కాకుండా, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా,సొంత స్థలం ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ఆయన పర్యవేక్షిస్తున్నారు.
అదే విధంగా,వ్యవసాయ సీజన్‌కు ముందే రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందేలా చూస్తూ అన్నదాతల పక్షపాతిగా నిలుస్తున్నారు…..

మంత్రి పొంగులేటి నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సచివాలయంలో ఉన్నా, క్యాంప్ ఆఫీసులో ఉన్నా ప్రజల వినతులు స్వీకరించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.మంత్రి పొంగులేటి వద్దకు వచ్చే సామాన్యుడికి ఉండే ధీమా ఒక్కటే.. “అన్నను కలిస్తే పని అయిపోతుంది,సమస్య ఏదైనా, ఆర్జీ పట్టుకుని వస్తే చాలు.. అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపడం” పొంగులేటి శైలి.ఈ విధానం వల్ల సామాన్య ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం పెరగడమే కాకుండా, కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పిందని పాలేరు నియోజకవర్గ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు…..

అధికార గర్వం లేకుండా, సామాన్య కార్యకర్త నుండి వృద్ధుల వరకు అందరినీ పేరుపేరునా పలకరిస్తూ వారి కష్టాలను వినడం పొంగులేటి ప్రత్యేకత. ఈ మానవీయ కోణమే ఆయనను ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసేలా చేస్తోంది.ఎక్కడా ఆడంబరాలకు పోకుండా, తనను కలిసేందుకు వచ్చే ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే ఆయన తీరు పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా సానుకూలత వ్యక్తమవుతోంది. అటు అభివృద్ధి పనులు, ఇటు సంక్షేమ పథకాల అమలును సమన్వయం చేసుకుంటూ వెళ్తుండడంతో “మాట ఇస్తే తప్పని నాయకుడు” అని మరోసారి నిరూపించుకున్నాడు,అంతే కాకుండా పాలేరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుండడం, ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కారమవుతుండడంతో నియోజకవర్గ ప్రజలు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నాయకత్వం పట్ల పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒకవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అభివృద్ధి వ్యూహం మరో వైపు పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలబెడుతుంది,రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఒకవైపు.. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు మరోవైపు.. రెండింటినీ సమన్వయం చేస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  సాగిస్తున్న రాజకీయ ప్రస్థానం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధికి నిధులు, కష్టానికి స్పందన, ప్రజా సంక్షేమమే ఊపిరిగా సాగుతున్న ఆయన పాలన పట్ల పాలేరు జనం నీరాజనాలు పడుతున్నారు…..