తెలంగాణ/ఖమ్మం జిల్లా:
ఖమ్మం : “ప్రభుత్వం అంటే ప్రజల కోసం.. ప్రజల వద్దకే పాలన” అనే ఇందిరమ్మ రాజ్యపు ఆశయాన్ని నిజం చేస్తూ పాలేరు నియోజకవర్గంలో సరికొత్త ప్రజా పాలన శకానికి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శ్రీకారం చుట్టారు.సామాన్యులు తమ చిన్న చిన్న సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే పని లేకుండా, అధికారులందరినీ ప్రజల ముంగిట నిలబెట్టేలా క్షేత్రస్థాయిలో ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని రూపొందించారు…..
ఈ ప్రజా దర్బార్లో జిల్లా కలెక్టర్ మొదలుకొని నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒకే వేదికపైకి రానున్నారు.రెవెన్యూ,భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల విజ్ఞప్తులు, కొత్త రేషన్ కార్డులు, స్థానిక మౌలిక సదుపాయాల వరకు ఏ రకమైన సమస్యకైనా తక్షణ పరిష్కారమే ధ్యేయంగా మంత్రి ఈ వేదికను తీర్చిదిద్దారు. ప్రతి ఫిర్యాదును స్వయంగా పర్యవేక్షించేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం విశేషం……
ఈ నెల 25వ తేదీ శనివారం రెండు ప్రధాన కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.నేలకొండపల్లి మండలం రాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు తొలి దర్బార్ జరుగుతుంది. ఈ కేంద్రానికి రాయిగూడెం, అజయ్తండా, చెరువుమాదారం, మంగాపురం తండా, అప్పలనరసింహపురం, బుద్ధారం, కట్టుకాచారం, కొంగర, రాజారాంపేట, భైరవునిపల్లి గ్రామ పంచాయతీల ప్రజలు తమ సమస్యలతో హాజరుకావచ్చు,మధ్యాహ్నం 3:30 నుండి తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతుందని….
ఆ తరువాత మధ్యాహ్నం 3:30 గంటల నుండి రాత్రి 7:30 వరకు రెండో వేదిక సిద్ధమైంది. ఈ కేంద్రానికి సుబ్లేడు, లక్ష్మీదేవిపల్లి తండా, రఘునాధపాలెం, హస్నాబాద్, ఇస్లావత్ తండా, మహమ్మదాపురం, మేకల తండా, మేడిదపల్లి, చంద్రు తండా, జోగులపాడు, పాతర్లపాడు, గోల్ తండా, జల్లెపల్లి గ్రామ పంచాయతీల ప్రజలు తరలిరానున్నారు,తన నియోజకవర్గంలో ఏ ఒక్క పౌరుడు సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగకూడదనే ఆకాంక్షతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను” అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారని, అధికారులు పూర్తి సమాచారంతో క్షేత్రస్థాయికి రావాలని ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని,మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి
తుంబూరు దయాకర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు…..
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456