జనం ముచ్చట ఖమ్మం జిల్లా:
రఘునాథపాలెం మండలం కోయచలక రెవెన్యూ పరిధిలోని
192 సర్వే నెంబర్లో ప్రముఖ మట్టి వ్యాపారి దాదాపు ఐదు నుండి పది ఎకరాలు ప్రభుత్వ భూములను ఆక్రమించి దాంట్లో
ఫాంమాయిల్ మొక్కలు నాటడంతో పాటు విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మిస్తున్నట్లు ఆ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి, తిరిగి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని రఘునాడపాలెం మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు మండల సిపిఎం పార్టీ కార్యదర్శి నవీన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు….
సిపిఎం పార్టీ కలెక్టరుకు ఇచ్చిన వినతి పత్రం పూర్తి సారాంశం……
వినతి పత్రం
జిల్లా కలెక్టర్ గారికి,
Khammam District Collectorate
ఖమ్మం జిల్లా.
విషయం: ప్రభుత్వ భూమిని ఆక్రమించి గెస్ట్ హౌస్ నిర్మాణం చేస్తున్న ప్రైవేటు వ్యక్తులపై తక్షణ చర్యలు తీసుకోవాలని – సిపిఎం పార్టీ తరఫున వినతి.
ఆర్యా
Communist Party of India (Marxist) రఘునాధపాలెం మండల కమిటీ తరుపున వినమ్రంగా తెలియజేయునది ఏమనగా,
రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి గెస్ట్ హౌస్ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు.
ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా నిర్మాణం జరగడం పూర్తిగా చట్టవిరుద్ధం.
ఇది ప్రజా ఆస్తిపై దురాక్రమణ మాత్రమే కాక ప్రజల హక్కులకు భంగం కలిగించే చర్య. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు వినియోగించాల్సిన భూమి ప్రైవేటు స్వార్థ ప్రయోజనాలకు వాడబడటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం.
అందువల్ల సిపిఎం పార్టీ తరఫున కింది చర్యలు తక్షణమే తీసుకోవాలని మనవి:
డిమాండ్లు….
- సంబంధిత తహసీల్దార్ మరియు రెవెన్యూ అధికారులతో వెంటనే భూ సర్వే నిర్వహించాలి.
- అక్రమ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలి.
- ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
- ప్రభుత్వ భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకొని భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలి.
ప్రజా ఆస్తి పరిరక్షణలో జిల్లా పరిపాలన తగిన బాధ్యత వహించి వెంటనే చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ వినతిపత్రం సమర్పిస్తున్నాము.
ధన్యవాదాలు.
సిపిఎం పార్టీ తరఫున
ఎస్. నవీన్ రెడ్డి
(సిపిఎం రఘునాధపాలెం మండల కార్యదర్శి)
సెల్: 9912741649
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456