జనం ముచ్చట,ఖమ్మం జిల్లా:
ఎదులాపురం మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన పోకబత్తిన అనిత మరియు వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన స్వర్గీయ తమ్మినేని కృష్ణయ్య తనయుడు తమ్మినేని నవీన్ సహచర కౌన్సిలర్లు వెంపటి ఉమా వెంకన్న,కడవ నవీన్ తదితరులు ఈ రోజు సాయంత్రం రూరల్ ఎసిపి బిల్లా తిరుపతి రెడ్డి, రూరల్ సిఐ ముష్కరాజ్ ను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది….

ఖమ్మం రూరల్ ఎసిపి బిల్లా తిరుపతి రెడ్డితో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు….
ఈ సందర్భంగా ఎసిపి తిరుపతి రెడ్డి చైర్‌పర్సన్,వైస్ చైర్మన్‌లను, ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు,
ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సారథ్యంలో ఎదులాపురం మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు, అంతే కాకుండా మున్సిపాలిటీ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు….

ఖమ్మం రూరల్ సిఐ ముష్కరాజును మర్యాద పూర్వకంగా కలిసిన వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్…..
ప్రజా సేవతో పాటు,ప్రశాంత వాతావరణం కోసం పోలీసు శాఖకు ఎల్లప్పుడూ మా మద్దతు ఉంటుందని చైర్మన్,వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు,ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు వెంపటి రవి,ఒంటికొమ్ము శ్రీనివాస రెడ్డి ,తోట చిన్న వెంకటరెడ్డి, రామిశెట్టి రమేష్, వేంపటి సుధాకర్ తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456