ఖమ్మం సిటీ :Feb:4:2:2025
ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసాక సీపీఐ పార్టీ ప్రచారం జోరందుకుంది, స్థానిక 28 వ వార్డులో సీపీఐ పార్టీ అభ్యర్థి దండి రంగారావు సీపీఐ కార్యకర్తలు,కుటుంబ సభ్యులతో కలిసి
గడప గడపకు కలియ తిరుగుతూ ముమ్మరంగా ప్రచారన్ని
ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు….
ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో గడప,గడపకు ప్రచారం నిర్వహిస్తున్న 28 వ వార్డు సీపీఐ అభ్యర్థి దండి రంగారావు…
ఈ సందర్బంగా దండి రంగారావు మాట్లాడుతూ
ప్రజా సమస్యల మీద అనేక ప్రజా పోరాటాలు నిర్వహించిన
ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ ), ముఖ్యంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో
నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఎన్నో యేండ్లుగా నిరుపేద వర్గాల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కష్ట పడుతూ, నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ,ప్రజలే దేవుళ్ళుగా భావిస్తూ పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడుతున్నానని,ఇప్పటివరకు వరంగల్ క్రాస్ రోడ్డులో జరిగిన అభివృద్ధి వెనుక నా వంతు కృషి,సీపీఐ పార్టీ పోరాటాలు ఉన్నాయని పేర్కొన్నారు,అందుకే ఒక బీసి బిడ్డగా, మీలో ఒకడిగా సీపీఐ పార్టీ తరుపున పోటీలో ఉన్నాను, కావునా మీ అమూల్యమైన ఓటు కంకీ కొడవలి గుర్తుపై వేసి తనను గెలిపించవలసిందిగా 28 వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు…..

తండ్రి దండి రంగారవును గెలిపించాలంటూ 28 వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న కుటుంబ సభ్యులు….
అదే విధంగా దండి రంగారావు కుటుంబ సభ్యలు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏదులాపురం గ్రామంలో సీపీఐ పార్టీ ఎంతో అభివృద్ధి చేసిందని, స్వర్గీయ దండి భాస్కర్, ప్రస్తుత సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద అనేక పోరాటాలు చేసిన చరిత్ర మా కుటుంబానికి ఉందని, పూటకో పార్టీ,పూటకో జెండా మార్చే వ్యక్తులను నమ్మవద్దని,
ప్రజా సమస్యలపై నిజమైన పోరాటం చేసేది ఒక్క సీపీఐ పార్టీ మాత్రమేనని అందుకే నిత్యం మీలో ఒకడిగా ఉంటు,
మీ సమస్యలను తమ సమస్యగా భావించి, మీ కోసం పాటుపడే దండి రంగారావును గెలిపంచాలని 28 వ డివిజన్ ప్రజలను కోరుకుంటున్నామని తెలిపారు…..
Pathi Srinivasa Rao:9703873456