తెలియక తప్పు చేశాను, నాపై ట్రోలింగ్ ఆపండి: గౌతమి రాథోడ్ ఆవేదన!!

Pathi Sreenivas Rao

ఫవిత్రమైన,బాధ్యతయుతమైన,ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తూ, పాఠశాల సమయంలో సోషల్ మీడియాలో రీల్స్ చేయడమే కాకుండా ప్రభుత్వ నీయమాలకు విరుద్ధంగా ఫెయిడ్ ప్రమోషన్లు చేస్తూ విధుల నుండి సస్పెన్షన్ కు గురైన ఖమ్మం మామిళ్లగూడెం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయిని గౌతమి రాథోడ్ తన పేస్ బుక్ ఏకౌంట్ ద్వారా తన గోడును వెలిబుచ్చింది,తెలియక చేసిన తప్పుకు ఇంత పెద్ద శిక్ష వేశారంటూ కన్నీటి పర్యంతం అయింది….

ఆమె సోషల్ మీడియా వేదికగా ఏం మాట్లాడిందో ఒకసారి
గమనిస్తే ఒక బాధ్యత కలిగిన ఉపాధ్యాయురాలిగా నా వృత్తికి ఎటువంటి అన్యాయం చేయలేదు,చేయను కూడా,కానీ నా అవివేకం వలన కొన్ని కార్పొరేట్ సంస్థలకు పేయిడ్ ప్రమోషన్లు చేయడం జరిగింది, నేను మొదటిసారి ప్రమోషన్ చెప్పిన్సపుడే ఇలా చేయకూడదని ఎవరైనా సలహా ఇచ్చి ఉంటే బాగుండేది,ఈ విషయం మీద సరైన గైడెన్స్ లేకపోవడం వలన తెలియనితనంతో ప్రమోషన్లు చేసిన మాట వాస్తవమే,మా పిల్లలు సైనికుల సంక్షేమం కోసం నిధులు సేకరిస్తున్నామని మా పిల్లలు చెబితే పిల్లలకు ఇచ్చిన మాట కోసం కొన్ని ప్రమోషన్లు చేశాను తప్ప పాఠశాల సమయాల్లో నేను రీల్స్ చేయలేదు,అలా చేసి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు నేనెపుడు అన్యాయం చేయలేదు,అది నా ఉదదేశ్యం కూడా కాదు,ఈ విషయం ఎలా చెప్పుకోవాలో కూడా తెలియడం లేదంటూ కన్నీటి పర్యంతం అయ్యారు….,

వాట్సాప్, పేస్ బుక్, ఇంస్ట్రాగ్రామ్ వంటి సామాజిక మధ్యమాల్లో అసభ్యకరంగా నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు, నేనేమైనా హత్యలు చేసానా? గంజాయి, హెరాయిన్ లాంటి మాధకాద్రావ్యాలు అమ్మానా? ఎందుకు నన్ను ఇంత హింస పెడుతున్నారు? మీరు పెట్టే హింసను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అంటు విలపించారు,ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను నేను తరగతి గదిలో పిల్లల సబ్జెక్ట్ తప్ప ఎలాంటి రీల్స్ చేయలేదు,నా విధి నిర్వహణను విస్మరించి ఏనాడూ రీల్స్ చేయలేదు,గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చేరాలని ఇంటింటికి తిరిగి అడ్మిషన్లు చేసానుగాని, ప్రయివేట్ స్కూల్స్ అడ్మిషన్ల కోసం నేనెపుడు ప్రమోషన్లు చేయలేదు,నేను తరగతులు బోదించే ఆరు, ఏడు తరగతుల పిల్లలను విచారించండి నేనెప్పుడైనా పాటలు పాడానా, రీల్స్ చేసానా అని, ఏ నాడు నా వృత్తికి ద్రోహం చేయలేదు, నా వృత్తికి కలంకం తెచ్చే పనిని ఎప్పుడు చేయలేదు, పిల్లలకు ఆటలు నేర్పించాను,పేద పిల్లలకు పుస్తకాలు డొనేట్ చేశాను, ఖాళీ సమయంలో పిల్లలకు యూట్యూబ్ క్లాసులపై అవగాహన కలిగించాను,ఒక ఉపాసధ్యాయినిగా ఇంతకన్నా ఏమి చేయగలను,ఇవేమి అర్ధం చేసుకోకుండా నా మీద నోటికి ఏది వస్తే అది రాస్తూ నన్ను నానా విధాలుగా హింసలకు గురించేస్తున్నారంటు ఆగని కన్నీళ్లతో తన మనుసులో ఉన్న ఆవేదనను వెలిబుచ్చారు….

పాఠాలు చెప్పకుండా రీల్స్ చేసిందంటూ తప్పుడు ప్రచారాలు, తప్పుడు వార్తలు వ్రాస్తూ మీ ఛానెల్ల వ్యూస్ కోసం మనిషిని చంపేస్తారా అంటూ మీడియాను ప్రశ్నించారు, నాలుగు రోజుల నుండి కనీసం మంచినీళ్లు కూడా త్రాగలేదు, ప్రస్తుతం ఈ వీడియో చేయొచ్చో చేయ కూడదో తెలియదు, బిపి డౌన్ అయిపొయింది,నా మైండ్ పని చేయడం లేదు,రీల్స్ పిచ్చిలో పడి కడుపుకు అన్నం పెట్టే ఉద్యోగానికి అన్యాయం చేసుకుంటున్నాని గ్రహించ లేకపోయానంటూ తన పేస్ బుక్ ఖాతా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు,తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కానీ ఉద్యోగం నుండి సస్పెండ్ చేసే ముందు బాధితురాలికి నోటీసులు జారీ చేయాలి కానీ పై అధికారులు ఈ ప్రక్రియ చేపట్టకుండా సస్పెన్షన్ వేటు వేయడం సబబు కాదనే అభిప్రాయం జనాల్లో వెలువడుతుంది…

అంతే కాకుండా ఈ రోజు ఏ కార్పొరేట్ స్కూల్ అడ్మిషన్ల కోసం ప్రమోషన్ చేసిందని ఒక గిరిజన బిడ్డ మీద సస్పెన్షన్ వేటు వేసారో ఆ పాఠశాలకు డైరెక్టర్ గా అన్నీ తానై వ్యవహారిస్తున్న ఒక ప్రభుత్వ ఉపాధ్యాయిని కావడం విశేషం,కానీ అన్నీ తెలిసి కూడా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకో లేదు,ఆమె అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తిగా, ప్రముఖ కాంట్రాక్టర్ సతీమణిగా అంగబలం, అర్ధ బలంతో పాటు రాజకీయ పలుకుబడి ఉండటంతో ఆమెపై చర్యలు తీసుకోడానికి వెనకడుగు వేస్తున్నారని దళిత, గిరిజన సంఘాలు మండి పడుతున్నాయి,రెండు యూనియన్ల మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధంలో ఒక గిరిజన బిడ్డ బలైందని, ఈ విషయం మీద
“జనం ముచ్చట” తో మాట్లాడిన లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు గిరిజన లంబాడా బిడ్డ గౌతమి రాథోడ్ సస్పెన్షన్ కు వ్యతిరేకంగా త్వరలో జిల్లా విద్యాశాఖధికారిని కలుస్తామని లంబాడా హక్కుల నాయకులతో పాటు,బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ సంఘాలు కూడా కలిసి వస్తారని తెలిపారు……