నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ రద్దు!

Pathi Sreenivas Rao

ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభం కావాల్సిన
నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ రద్దు,పాలనాపరమైన కారణాలతో టెండర్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సింగరేణి యాజమాన్యం,నైనీ కోల్ మైన్స్ టెండర్స్ విషయంలో తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే టెండర్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

ఇది ఇలావుంటే నైనీ టెండర్ల విషయంలో సంస్థ విధించిన నిబంధనలపై సింగరేణి పాలకమండలి ఎందుకు చర్చించలేదని ప్రశ్నించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ,చర్చించి ఉంటే టెండర్ల విషయంలో అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి?
టెండర్ వెయ్యాలనుకున్న కంపెనీలకు ఎందుకు సైట్ విజిట్ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది….

అయితే టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని.. నిబంధనలు,టెండర్లపై పాలక మండలిలో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని తెలిపిన సింగరేణి అధికారులు….