మహిళా జర్నలిస్టులపై విచారణ పేరుతో పోలీసులు వేదింపులకు గురిచేస్తున్నారు!!

Pathi Sreenivas Rao

ఒక ఐఎస్ఐ ఆఫీసర్,మంత్రికి సంబంధించి ఎన్టీవీలో వెలువడిన వార్తా కథనం విషయంలో సీఎం.రేవంత్ రెడ్డి సర్కార్ జర్నలిస్టులపై అరెస్టుల పేరుతో సృష్టిస్తున్న దృష్టాంతాలకు,ముఖ్యంగా మహిళా జర్నలిస్టులపై విచారణ పేరుతో పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా ఎన్టీవీ న్యూస్ యాంకర్ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు….

నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో “రెడ్ బుక్” రాజ్యాంగం పేరిట మానవ హక్కుల ఉల్లంఘన ఏదెచ్చగా జరుగుతుంటే ఆ రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వ అధినేతలు న్యూట్రల్ మీడియాపై కత్తికట్టి అక్రమ అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు,మీడియాను అరెస్టుల రూపేణ బెదరగొట్టాలని చూస్తే మీడియాతో తలంపులు పెట్టుకున్న సమైక్యాంధ్ర నాయకులు,వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమయ్యారో,ఏ విధంగా జనాగ్రహానికి గురయ్యారు ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి పునచ్చరన చేసుకుంటే మంచిదేమో ? అయితే మాకు భజన చేయాలి,లేకుంటే తొక్కి పడేస్తాం అనే చందంగా మీడియాపై ప్రభుత్వం దమనకాండ కొనసాగిస్తుంది,ఇలాంటి ధోరణి అనుసరించిన నియంతలెందరో చరిత్ర గర్భంలో కలిసిపోయారు,మీకు డబ్బాలు కొట్టే ఛానెల్స్ పొగడ్తలే కాదు న్యూట్రల్ ఛానెల్స్ యొక్క విధానపరమైన విమర్శలు కూడా హోంథాగా స్వీకరించే తత్వం కూడా ప్రభుత్వాలు అలవర్చుకోవాలని తెలంగాణ మేధావులు,బుద్ధి జీవులు సూచిస్తున్నారు……