మార్చి 22 న రైతు భరోసా నిధులు విడుదల: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి!!

Pathi Sreenivas Rao

ఈ నెల 22 న రైతు భరోసా విడుదల చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు,ఈ యాసంగి సీజన్ కు సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మంజూరి అయ్యాయని,తొలి విడతగా ఎకరం లోపు 3,590 కోట్లతో 75 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని,రెండో విడతలో మరో 2,650 కోట్లు నిధులు విడుదల చేస్తామని, ఏప్రిల్ నెలాఖరు వరకు మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని దాంతో సంపూర్ణంగా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లోకి చేరతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు….