Janam Muchata – Voice of the People | Telugu News Platformఖమ్మం “స్మార్ట్ కిడ్జ్” పాఠశాలలో ఘనంగా మహిళ దినోత్సవం !! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 6:25 am
Date of Publish : 07 Mar 2026, 5:47 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 308 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఖమ్మం “స్మార్ట్ కిడ్జ్” పాఠశాలలో ఘనంగా మహిళ దినోత్సవం !!

ఖమ్మం “స్మార్ట్ కిడ్జ్” పాఠశాలలో ఘనంగా మహిళ దినోత్సవం !!

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు,తొలుత పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య మహిళా ఉపాధ్యాయులతో కలిసి కేక్ కట్ చేసి,మిఠాయిలు పంచారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విద్యార్థులు రోల్ ఆఫ్ ఉమెన్ అనే అంశంపై ఉపన్యాస పోటీలలో పాల్గొన్నారు…..

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య మాట్లాడుతూ ఆకాశంలో సగభాగంగా ఉన్న మహిళలు రాజకీయ, సామాజిక, ఆర్థిక శక్తిగా ఎదగాలని కోరారు. మహిళల ప్రాధాన్యతను తెలియజేసేందుకు తమ పాఠశాలలో పోటీలు నిర్వహించి బహుమతులు అందించామని తెలిపారు. మహిళలు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు….