తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం సిటీ : భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'SIR' (Special Intensive Revision - ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియపై ఖమ్మం జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. ఈ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పువ్వాడ అజయ్ కుమార్ తన కార్యాచరణను ముమ్మరం చేశారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLA)
ఈ ప్రక్రియపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ఆయన నేతృత్వంలో మంగళవారం (జూన్ 16) ఒక ప్రత్యేక అవగాహన సదస్సు జరగనుంది….
ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా పువ్వాడ పక్కా ప్రణాళికను రూపొందించారు. ప్రధానంగా కొత్త ఓట్ల నమోదు, మరణించిన వారి ఓట్ల తొలగింపు, వలస వెళ్లిన వారి ఓట్ల సవరణ వంటి కీలక అంశాలపై బూత్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో ఎలా వ్యవహరించాలో
ఈ సదస్సులో శిక్షణ ఇవ్వనున్నారు.ఈ సమగ్ర సవరణ ప్రక్రియ ఓటర్ల సంఖ్యపై మరియు భవిష్యత్తు ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ శ్రేణులను అలర్ట్ చేశారు….
"ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ప్రకారం, రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) ఒక రోజుకు గరిష్ఠంగా 50 ధ్రువీకరించిన ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించి బీఎల్‌ఓలకు అందించవచ్చు.
ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ శ్రేణులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఏ ఒక్క అర్హుడైన ఓటరు కూడా జాబితా నుండి తొలగించబడకుండా, అలాగే నకిలీ ఓట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచాలి."ఈ నేపథ్యంలో మంగళవారం జరగబోయే అవగాహన సదస్సుకు ఖమ్మం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ బూత్ ఏజెంట్లు, ముఖ్య నాయకులు అందరూ తప్పనిసరిగా హాజరై, ఈ 'SIR' ప్రక్రియపై పూర్తి అవగాహన పెంచుకోవాలని పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు……
పత్తి శ్రీనివాస్ (MD), జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456