Janam Muchata – Voice of the People | Telugu News Platformకేటీఆర్ ఫేక్ న్యూస్ ప్రచారంపై తీవ్ర విమర్శలు: 1/70 చట్టం… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 3:02 am
Date of Publish : 13 Jun 2026, 11:17 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 273 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

కేటీఆర్ ఫేక్ న్యూస్ ప్రచారంపై తీవ్ర విమర్శలు: 1/70 చట్టం వ్యాఖ్యల వక్రీకరణ వెనుక ‘ధరణి’ భయమేనా?

కేటీఆర్ ఫేక్ న్యూస్ ప్రచారంపై తీవ్ర విమర్శలు: 1/70 చట్టం వ్యాఖ్యల వక్రీకరణ వెనుక ‘ధరణి’ భయమేనా?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత పదేండ్ల పాలనలో విచ్చలవిడిగా దోచుకున్న అవినీతి సొమ్ముతో, విదేశాల నుంచి పెయిడ్ బ్యాచ్‌ల ద్వారా సోషల్ మీడియాను నడిపిస్తూ బీఆర్ఎస్ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని పౌర సమాజం, అధికార పక్ష నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్‌ను ఉద్దేశించి "డ్రామారావు" అంటూ సెటైర్లు వేస్తూ, ఆయన రాజకీయ ఎజెండా కేవలం తప్పుడు ప్రచారాలకే పరిమితమైందని ధ్వజమెత్తుతున్నారు....

ఇటీవల రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ఇందిరమ్మ ఇండ్ల శీనన్న) ఒక సమావేశంలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు.. ఒక జర్నలిస్టు ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన భూముల పరిరక్షణకు ఉద్దేశించిన '1/70 చట్టం' గురించి నిర్దిష్టమైన ప్రశ్న అడిగారు. దీనికి మంత్రి చట్టపరమైన వివరణ ఇచ్చారు.
కానీ, ఈ వీడియోను ఎడిట్ చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు.. మంత్రి మొత్తం రాష్ట్రంలోని "రైతుల భూములపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, రైతుల భూములు లాగేసుకుంటున్నారని" పచ్చి అబద్ధాలను నెట్టింట వైరల్ చేశాయి. ఒక గిరిజన చట్టానికి సంబంధించిన సమాధానాన్ని, సాధారణ రైతుల భూములకు ఆపాదించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేశారని అధికార వర్గాలు తీవ్రంగా ఖండించాయి.....

ఈ తప్పుడు ప్రచారం వెనుక బలమైన రాజకీయ కారణం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'ధరణి' పోర్టల్ ముసుగులో జరిగిన వేల ఎకరాల భూకబ్జాలు, అక్రమాలను ప్రస్తుత ప్రభుత్వం వెలికితీస్తుండటమే బీఆర్ఎస్ నేతల అసహనానికి కారణమని తెలుస్తోంది.వివాదాస్పదమైన ధరణి పోర్టల్ స్థానంలో, రైతుల భూములకు మరింత రక్షణ కల్పిస్తూ అత్యంత పారదర్శకంగా 'భూ భారతి' (భూమాత) వ్యవస్థను ప్రభుత్వం తీసుకువస్తోంది.ఈ కొత్త వ్యవస్థ ద్వారా గత పాలకుల కబ్జాలకు అడ్డుకట్ట పడటమే కాకుండా, వారి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ భయంతోనే రెవెన్యూ మంత్రిగా ఉన్న మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా ఇలాంటి కల్పిత వార్తలను, తప్పుడు ప్రచారాలను సృష్టిస్తున్నారని విమర్శకులు ఎత్తిచూపుతున్నారు......

తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, ఇలాంటి సోషల్ మీడియా జిమ్మిక్కులకు వారు మోసపోరని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. కేవలం విదేశాల నుంచి ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో అబద్ధాలు స్ప్రెడ్ చేయడం ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న కేటీఆర్ పగటి కలలు ఎన్నటికీ నెరవేరవని, వాస్తవాలు గ్రహించే ఆలోచనా శక్తి తెలంగాణ సమాజానికి ఉందని మంత్రి పొంగులేటి సీరియస్ వ్యాఖ్యలు చేసారు....