Janam Muchata – Voice of the People | Telugu News Platform › నిరుపేదలకు కొండంత అండగా ‘ముఖ్యమంత్రి సహాయనిధి’ తుంబూరు దయాకర్ రెడ్డి… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 09 Oct 2026, 9:08 pm
Date of Publish : 04 Jun 2026, 4:31 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 188 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Politics > Telangana

నిరుపేదలకు కొండంత అండగా ‘ముఖ్యమంత్రి సహాయనిధి’ తుంబూరు దయాకర్ రెడ్డి !!

నిరుపేదలకు కొండంత అండగా ‘ముఖ్యమంత్రి సహాయనిధి’ తుంబూరు దయాకర్ రెడ్డి !!

ఖమ్మం: వైద్య ఖర్చుల భారంతో సతమతమవుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు.ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో గల మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులకు ఆర్థిక సాయాన్ని అందజేశారు.....

ఈ కార్యక్రమంలో మొత్తం 51 మంది లబ్ధిదారులకు రూ. 16,16,500 విలువైన చెక్కులను తుంబూరు దయాకర్ రెడ్డి తన చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఖమ్మం రూరల్ మండలం: 30 మంది లబ్ధిదారులు,ఏదులాపురం మున్సిపాలిటీ: 21 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు,చెక్కుల పంపిణీ అనంతరం దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఆ ఖర్చులు భరించలేక అప్పుల పాలవుతున్న నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సీంఎఆర్‌ఎఫ్ ద్వారా అభయహస్తం అందిస్తోందని స్పష్టం చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, బాధిత కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సాయం అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన వెల్లడించారు. నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు....

ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, ఖమ్మం రూరల్ మరియు ఏదులాపురం ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు....