Janam Muchata – Voice of the People | Telugu News Platformగత ప్రభుత్వ దోపిడీకి కాంగ్రెస్‌ పాలనతో చెక్: తుంబూరు దయాకర్… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 3:11 am
Date of Publish : 02 Jun 2026, 10:42 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 236 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

గత ప్రభుత్వ దోపిడీకి కాంగ్రెస్‌ పాలనతో చెక్: తుంబూరు దయాకర్ రెడ్డి!!

గత ప్రభుత్వ దోపిడీకి కాంగ్రెస్‌ పాలనతో చెక్: తుంబూరు దయాకర్ రెడ్డి!!

ఖమ్మం, జూన్ 2: గత పాలకుల అవినీతి, దోపిడీ పాలన వల్ల అప్పులపాలైన తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మంలోని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.తుంబూరు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు…..

ఈ సందర్భంగా తుంబూరు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ దూసుకుపోతోందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (మహాలక్ష్మి పథకం), 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (గృహ జ్యోతి) వంటి విప్లవాత్మక పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ పేద గడపల్లో వెలుగులు నింపుతున్నామని పేర్కొన్నారు….

గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పాలేరు నియోజకవర్గం పూర్తిగా నిశ్చేష్టంగా మారిందని, అభివృద్ధి అట్టడుగుకు చేరిందని దయాకర్ రెడ్డి విమర్శించారు. అయితే, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రస్తుతం పాలేరు రూపురేఖలు మారుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, నూతన గృహాల నిర్మాణాలతో ఊహించని రీతిలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలకు 'ఇందిరమ్మ ఇళ్లు' అందించే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి క్రియాశీలంగా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు,ఈ వేడుకల్లో పాలేరు నియోజకవర్గ ఆత్మ (ATMA) కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, ఇమామ్ ,యెనిగండ్ల నాగేశ్వరరావు,వజ్రాల కృష్ణారెడ్డి,స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు మంత్రి పొంగులేటి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు….