Janam Muchata – Voice of the People | Telugu News Platformఖమ్మం మమతా విద్యాసంస్థల్లో ఘనంగా ‘గ్రాడ్యుయేషన్ డే’ వేడుకలు!! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 1:45 pm
Date of Publish : 31 May 2026, 9:42 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 186 💬 0
Latest News > Bhadradri Kothagudem > Health > Khammam > Medical News > Telangana

ఖమ్మం మమతా విద్యాసంస్థల్లో ఘనంగా ‘గ్రాడ్యుయేషన్ డే’ వేడుకలు!!

ఖమ్మం మమతా విద్యాసంస్థల్లో ఘనంగా ‘గ్రాడ్యుయేషన్ డే’ వేడుకలు!!

ఖమ్మం సిటీ, మే 31: నగరంలోని మమత మెడికల్, డెంటల్, మరియు నర్సింగ్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే (పట్టాల ప్రదానోత్సవం) వేడుకలు మమతా క్యాంపస్ ఆవరణలో ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. తమ విద్యాభ్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని, వైద్య వృత్తిలోకి అడుగుపెడుతున్న వందలాది మంది విద్యార్థులతో క్యాంపస్ అంతా కోలాహలంగా మారింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాళోజి నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ (KNRUHS) వైస్ ఛాన్సలర్ డాక్టర్ కే.రమేష్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పట్టాలను అందజేసి, వారిచే వైద్య వృత్తి ప్రమాణ స్వీకారం (Hippocratic Oath) చేయించారు…..

ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ… "వైద్య వృత్తి అనేది సమాజంలో అత్యంత పవిత్రమైనది. పట్టాలు పుచ్చుకుని సమాజంలోకి అడుగుపెడుతున్న యువ వైద్యులు కేవలం సంపాదనకే ప్రాధాన్యత ఇవ్వకుండా, మానవీయ కోణంలో రోగులకు సేవలు అందించాలి. మమత విద్యాసంస్థలు ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్య విద్యను అందిస్తూ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అభినందనీయం," అని కొనియాడారు....

కార్యక్రమంలో మమత విద్యాసంస్థల డైరెక్టర్లు పువ్వాడ జయశ్రీ, పువ్వాడ నరేన్ గారలు పాల్గొని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సంస్థ వ్యవస్థాపకులు పువ్వాడ నాగేశ్వరరావు గారి ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.ఈ వేడుకల్లో మెడికల్, డెంటల్, నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ అనురాధ, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ వైష్ణవి తదితరులు పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు తమ కళాశాల రోజుల్లో సాధించిన ప్రతిభను, విద్యా ప్రమాణాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు….

పట్టాలు అందుకున్న అనంతరం విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ క్యాప్‌లను గాల్లోకి ఎగరేస్తూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. తమ విజయానికి సహకరించిన తల్లిదండ్రులు, అధ్యాపకులతో కలిసి సెల్ఫీలు దిగుతూ క్యాంపస్‌లో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్లు, అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…..