Janam Muchata – Voice of the People | Telugu News Platformకుల రాజకీయాలపై పవన్ కల్యాణ్ ఫైర్: కాపు నాయకులకు సీరియస్… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 8:31 am
Date of Publish : 27 May 2026, 3:24 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 259 💬 0
Andhra Pradesh > Alluri Sitharama Raju > East Godavari > Eluru > Guntur > Konaseema > Tirupati

కుల రాజకీయాలపై పవన్ కల్యాణ్ ఫైర్: కాపు నాయకులకు సీరియస్ వార్నింగ్!!

కుల రాజకీయాలపై పవన్ కల్యాణ్ ఫైర్: కాపు నాయకులకు సీరియస్ వార్నింగ్!!

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుల రాజకీయాలు చేసే వారిపై, ముఖ్యంగా తనను పదే పదే విమర్శించే కాపు నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కులాల పేరుతో రాజకీయం చేస్తున్న నాయకులకు ఆయన తనదైన శైలిలో గట్టి హెచ్చరిక జారీ చేశారు.2014లో తాను పార్టీ పెట్టినప్పుడే కులాలకు అతీతమైన రాజకీయం చేస్తానని చెప్పానని గుర్తుచేస్తూ, కుల పిచ్చితో ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారిపై మండిపడ్డారు.తాను కులం కోసం
పార్టీ పెట్టలేదని, అందరినీ కలుపుకు వెళ్లేందుకే జనసేనను స్థాపించానని తేల్చిచెప్పారు

తనను విమర్శించే కొందరు నాయకులు పదే పదే వంగవీటి రంగా గారి పేరును వాడుకోవడంపై పవన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రంగా గారి సతీమణి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారని, వారి బిడ్డలు రెండు కులాలకు చెందిన వారు అవుతారని గుర్తు చేస్తూ, నాయకులు తమ రాజకీయాల కోసం ఎంత కన్వీనియంట్ గా వ్యవహరిస్తున్నారో ఆలోచించుకోవాలని చురకలు అంటించారు,రంగా గారు బతికున్నప్పుడు ఆయన గురించి కనీసం పట్టించుకోని ప్రస్తుత కాపు సామాజికవర్గం నాయకులు ఆయన మరణం తర్వాత ఇప్పుడు ఆయన పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు,ప్రస్తుతం కాపు నేతలు "కాపుకు సీఎం పదవి కావాలి" అని డిమాండ్ చేస్తుండడం పట్ల పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు"కాపులకి సీఎం కావాలంటే మీరందరూ కలిసి ఒక మనిషిని వెతుక్కొని సీఎంని చేసుకోండి, అప్పుడు నేను కూడా అభినందిస్తాను" అంటూ అసహనంగా వ్యక్తం చేశారు....

కులాల పేరుతో తనపై వస్తున్న విమర్శల పట్ల పవన్ తీవ్ర విసుగును, అసహనాన్ని వ్యక్తం చేశారు. "నాకు కూడా విసుగు వచ్చేసింది. ఇంకా ఎంత కాలం మాట్లాడతారు? ఒక్కొక్కరి గురించి నేను చిట్టా విప్పాలా? నేను నోరు విప్పితే మీరు తట్టుకోగలరా?" అంటూ విమర్శకులకు ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు,తన పార్టీలో నాదెండ్ల మనోహర్
,లింగ రమేష్ ఉంటే వారిని వెంటనే కమ్మ సామాజిక వర్గానికి ఆపాదిస్తారని, ఎన్నికైన ఎమ్మెల్యేల్లో కాపులు, ఇతర వర్గాల వారు లేరా అని ఆయన ప్రశ్నించారు...

తనకు కులాల పట్టింపు లేదని,రాజకీయాల్లో కులాలు, మతాలు అనే సంకుచిత భావాలను దాటి ముందుకు వెళ్దామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు,సమాజంలో ఉన్న ప్రతి సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించే దిశగా ఆలోచించాలి తప్ప, పదే పదే కులాల పేరుతో విమర్శలు చేయడం ఇకనైనా మానుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ తాజా వైఖరి ఎంతవరకు సరైనది, రాజకీయంగా ఇది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అన్నది కాలమే నిర్ణయిస్తుందని కాపు సామాజికవర్గం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.....