Janam Muchata – Voice of the People | Telugu News Platformఖమ్మం జిల్లాలో తొలి ఘనత: ఆరోగ్య హాస్పిటల్‌కు ప్రతిష్టాత్మక ‘CAHO’… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 5:38 am
Date of Publish : 22 May 2026, 11:26 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 442 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఖమ్మం జిల్లాలో తొలి ఘనత: ఆరోగ్య హాస్పిటల్‌కు ప్రతిష్టాత్మక ‘CAHO’ సర్టిఫికేషన్ !!

ఖమ్మం జిల్లాలో తొలి ఘనత: ఆరోగ్య హాస్పిటల్‌కు ప్రతిష్టాత్మక ‘CAHO’ సర్టిఫికేషన్ !!

ఖమ్మం:వైద్య సేవల్లో నిరంతరం నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ 'ఆరోగ్య హెల్త్ సిటీ ఎల్.ఎల్.పి' (ఆరోగ్య హాస్పిటల్) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన CAHO – ACE CSSD (Consortium of Accredited Healthcare Organizations) సర్టిఫికేషన్‌ను ఆరోగ్య హాస్పిటల్ కైవసం చేసుకుంది. విశేషమేమిటంటే..
ఈ అత్యున్నత గుర్తింపు సాధించిన ఖమ్మం జిల్లాలోని మొట్టమొదటి హాస్పిటల్‌గా 'ఆరోగ్య' నిలిచి చరిత్ర సృష్టించింది.....

హాస్పిటల్స్ లో ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా చూసే అత్యున్నత స్థాయి స్టెరిలైజేషన్ (క్రిమిసంహారక) విధానాలు, రోగుల భద్రతా ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించినందుకు గాను ఈ సర్టిఫికేషన్ దక్కింది. పరికరాల శుద్ధి, భద్రత విషయంలో అంతర్జాతీయ స్థాయి నాణ్యతను ఆసుపత్రి పాటిస్తోందని ఈ గుర్తింపు ద్వారా మరోసారి నిరూపితమైంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అయిన '3M' సాంకేతిక మార్గదర్శకత్వంతో ఆరోగ్య హాస్పిటల్ ఈ అరుదైన గుర్తింపును సాధించడం మరింత గర్వకారణం.....

ఈ CAHO సర్టిఫికేషన్ ద్వారా ఆసుపత్రిలో చికిత్స పొందే రోగులకు అత్యుత్తమ ప్రయోజనాలు చేకూరనున్నాయి...ప్రధానంగా శస్త్రచికిత్సల (సర్జరీల) తర్వాత తలెత్తే ఇన్ఫెక్షన్ల ప్రమాదం (Post-operative infections) గణనీయంగా తగ్గుతుంది,ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది. అంతే కాకుండా ప్రపంచస్థాయి ఆసుపత్రులకు సమానమైన సురక్షిత వైద్య విధానాలు ఇక్కడ అమలు చేయబడతాయి.ఆసుపత్రి వాతావరణంలో శుభ్రత, పరికరాల స్టెరిలైజేషన్ మరియు నాణ్యతా నిర్వహణలో ఎక్కడా రాజీపడని విధానం ఉంటుంది.....

ఈ అరుదైన గుర్తింపు పట్ల ఆరోగ్య హాస్పిటల్ యాజమాన్యం మరియు వైద్య బృందం హర్షం వ్యక్తం చేసింది. "ప్రజలకు ఎల్లప్పుడూ సురక్షితమైన, అత్యుత్తమ నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే మా దృఢ సంకల్పానికి ఈ సర్టిఫికేషన్ ఒక గొప్ప మైలురాయి లాంటిది. ప్రపంచ ప్రఖ్యాత 3M సంస్థ సహకారంతో సాధించిన ఈ ఘనత మా బాధ్యతను మరింత పెంచింది," అని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
ఖమ్మం జిల్లాకే గర్వకారణంగా నిలిచిన ఈ ఘనత సాధించిన ఆరోగ్య హాస్పిటల్ యాజమాన్యాన్ని, వైద్యులను, మరియు సిబ్బందిని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.....