తెలంగాణ/హైదరాబాద్:
హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పైరసీ భూతం మరోసారి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలైన వెంటనే పైరసీ వెబ్‌సైట్లలో ప్రత్యక్షమవుతుండటంతో టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, తమను పైరసీ బారి నుండి కాపాడాలంటూ చిత్ర పరిశ్రమ ప్రతినిధులు మరోసారి హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా విడుదలైన చిత్రాలన్నీ 'ఐబొమ్మ' (iBomma), 'బొప్పం టీవీ' (Boppam TV) వంటి పైరసీ సైట్లలో తక్షణమే లభ్యమవుతున్నాయని నిర్మాతలు వాపోతున్నారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అధికారికంగా విచారణ ప్రారంభించారు...
ఐబొమ్మ రవిపై అనుమానాలు ...
ఈ పైరసీ వెనుక మళ్లీ పాత నిందితుడు 'ఐబొమ్మ రవి' హస్తం ఉండవచ్చని చిత్ర పరిశ్రమకు చెందిన వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, అయితే, ఈ ఆరోపణలను ఐబొమ్మ రవి తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుతం తానేమీ చేయడం లేదని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు,ఐబొమ్మ, బొప్పం టీవీలకు మార్కెట్లో ఉన్న పాపులారిటీ (బ్రాండ్ నేమ్) చూసి ఎవరో ఇతర వ్యక్తులు ఆ పేర్లను వాడుకుంటూ సినిమాలను అప్‌లోడ్ చేస్తుండవచ్చని ఆయన పేర్కొన్నారు ,గతంలో ఐబొమ్మ రవి కరేబియన్ దీవుల నుండి ఈ సైట్‌ను నిర్వహించేవారని, ఏదో వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు పోలీసులకు దొరికిపోయారని సమాచారం అయితే ప్రస్తుతం ఈ సరికొత్త పైరసీ లింకులను ఎవరు, ఏ దేశం నుండి ఆపరేట్ చేస్తున్నారనేది పోలీసులకు పెద్ద సవాలుగా మారింది
మనుగడ కోల్పోతున్న సినిమా పరిశ్రమ.....
ఇప్పటికే ఓటీటీల హవా పెరగడంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనివల్ల చాలా థియేటర్లు మూతపడే స్థితికి చేరుకున్నాయి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మళ్లీ పైరసీ సైట్లు యాక్టివ్ కావడం వల్ల చిత్ర పరిశ్రమ పూర్తిగా నష్టాల్లో మునిగిపోయే ప్రమాదం ఉందని, తగిన చర్యలు తీసుకొని పరిశ్రమను ఆదుకోవాలని నిర్మాతలు పోలీసులను కోరుతున్నారు,అదే విధంగా కేవలం పైరసీని మాత్రమే కాకుండా, ప్రేక్షకులు థియేటర్లకు దూరం కావడానికి గల అసలు కారణాలను కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం థియేటర్లలో టికెట్ ధరలు (దాదాపు రూ. 400) సామాన్యులకు భారంగా మారాయి. ఒక కుటుంబం థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలంటే టికెట్లతో పాటు పాప్‌కార్న్, కనీసం వాటర్ బాటిల్ (రూ. 70) వంటి వాటికే రూ. 1400 కి పైగా ఖర్చవుతోందని విమర్శించారు వినోదం పేరుతో సామాన్య ప్రజలను దోపిడీ చేయడం వల్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారని అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా చిత్ర పరిశ్రమ మనుగడ సాగించాలన్నా, ప్రేక్షకులు పైరసీ సైట్ల వైపు వెళ్లకుండా తిరిగి థియేటర్లకు రావాలన్నా.. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కేవలం పోలీసులపైనే ఆధారపడకుండా టికెట్ ధరలు, క్యాంటీన్ ఖర్చులను తగ్గించేలా ఒక సరైన మరియు శాశ్వతమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ ప్రజలు అభిప్రాయ పడుతున్నారు....
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456