Janam Muchata – Voice of the People | Telugu News Platformపదేళ్లు రైతులను గోసపెట్టి.. ఇప్పుడు ‘సోల్లు’ పురాణమా?బి.ఆర్.పార్టీ నాయకులపై మండిపడ్డ… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 6:26 am
Date of Publish : 14 May 2026, 6:18 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 102 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

పదేళ్లు రైతులను గోసపెట్టి.. ఇప్పుడు ‘సోల్లు’ పురాణమా?బి.ఆర్.పార్టీ నాయకులపై మండిపడ్డ మంత్రి పొంగులేటి!!

పదేళ్లు రైతులను గోసపెట్టి.. ఇప్పుడు ‘సోల్లు’ పురాణమా?బి.ఆర్.పార్టీ నాయకులపై మండిపడ్డ మంత్రి పొంగులేటి!!

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రతిపక్షాల తీరును ఎండగడుతూ.. నాడు అధికారంలో ఉండి వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టిన దొరవారు, నేడు రైతుల కోసం పోరాడుతున్నామంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందనీ ఎద్దేవా చేశారు. దోసిల్లో మొక్కలు పెట్టుకుని, కుండలకు పూతలు పూస్తూ ఫోటోలకు ఫోజులిస్తే ప్రజలు మోసపోరని బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులకు హితవు పలికారు ,మీ పదేళ్ల పాలనలో అధికారులు ఏనాడూ పేదల వద్దకు రాలేదు, కానీ ఈనాడు మేమే స్వయంగా ప్రజల గడప వద్దకు వచ్చి అప్లికేషన్లు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు…..

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఒంటి నిండా విషాన్ని నింపుకొని రోడ్ల వెంట విషం కక్కుతున్నాయని బి.ఆర్.ఎస్, బీజేపీ పార్టీలపై మంత్రి పొంగులేటి మండిపడ్డారు. మూడు నాలుగు సార్లు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మీకు జ్ఞానం రాలేదు. కుట్రలు, కుతంత్రాలతో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తే మీ కన్న కలలు కలలుగానే మిగిలిపోతాయని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. ప్రజా దీవెనలు ఉన్నంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు హెచ్చరించారు…..

మీలాగా సోల్లు పురాణం చెప్పి పబ్బం గడుపుకునే ప్రభుత్వం మాది కాదని….మాది చేతల ప్రభుత్వమని. ఇప్పటికే 73 వేల ఉద్యోగాలు ఇచ్చాం. నిరుద్యోగులకు త్వరలోనే మరిన్ని శుభవార్తలు చెబుతాం. గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను కాగితాలకే పరిమితం చేస్తే, మేము ఒక్క రూపాయి అవినీతి లేకుండా ₹5 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు….ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ , 15 వార్డుల కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు….